టీమ్ కోసం విరాట్ కోహ్లీ చేయాల్సిందంతా చేశాడు... దినేశ్ కార్తీక్ కామెంట్స్...

Published : Feb 01, 2022, 02:02 PM IST

విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇవ్వడంతో టెస్టుల్లో తర్వాతి కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతున్నా, క్లారిటీ అయితే రాలేదు. తాజాగా భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్, విరాట్ కెప్టెన్సీ గురించి కొన్ని కామెంట్లు చేశాడు...

PREV
18
టీమ్ కోసం విరాట్ కోహ్లీ చేయాల్సిందంతా చేశాడు... దినేశ్ కార్తీక్ కామెంట్స్...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వరుసగా ఐదేళ్లుగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకులో కొనసాగింది భారత జట్టు. విరాట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలోనూ నెం.1 టీమ్‌గా ఉంది...

28

వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కోవడం, ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ గెలవడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లి, భారత జట్టును మూడో స్థానానికి పడేసింది...

38

‘విరాట్ కోహ్లీ టీమిండియాను అద్భుతంగా నడిపించాడు. అతను టెస్టుల్లో భారత్‌ను పటిష్టమైన జట్టుగా తయారుచేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో నేను కూడా కొన్ని మ్యాచులు ఆడాను...

48

విరాట్ కోహ్లీ ప్రతీ మ్యాచ్‌లోనూ నూటికి రెండు వందల శాతం పెడతాడు. మ్యాచ్ గెలవడం కోసం చేయాల్సిదంతా చేస్తాడు. కెప్టెన్సీని విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేసే విధానం కూడా భలేగా ఉంటుంది...

58

టెస్టుల్లో భారత జట్టుకి దొరికిన అద్భుతమైన కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. విరాట్ కొన్నేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే కెప్టెన్‌గా అతను సాధించిన విజయాలు, మెమొరీస్‌గా గుర్తిండిపోతాయి...

68

విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్‌ను మళ్లీ తయారుచేయడం కూడా టీమిండియాకి చాలా కష్టమైన విషయమే... ’ అంటూ కామెంట్ చేశాడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్...

78

క్రికెట్‌గా రిటైర్మెంట్ ప్రకటించకముందే కామెంటేటర్‌గా కెరీర్ మొదలెట్టి, అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు దినేశ్ కార్తీక్. ఇంగ్లాండ్‌ టూర్‌లో కామెంటేటర్‌గా అదరగొట్టి, అక్కడి వారి అభిమానాన్ని చురగొన్నాడు...

88

36 ఏళ్ల వయసులోనూ రిటైర్మెంట్ ఆలోచన లేదంటున్న దినేశ్ కార్తీక్, టీ20 టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వడమే తనముందున్న లక్ష్యం అంటున్నారు. అన్నీ కుదిరితే టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆడతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు డీకే....

Read more Photos on
click me!

Recommended Stories