మాహీ కెప్టెన్ కూల్ అయితే విరాట్ కోహ్లీ ఫైర్... రోహిత్ శర్మ వేరే లెవెల్... మాజీ బౌలింగ్ కోచ్...

Published : Feb 01, 2022, 01:02 PM IST

గత 14-15 ఏళ్లల్లో టీమిండియాలో బిగ్గెస్ట్ బ్రాండ్స్ అంటే ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... మాహీ కెప్టెన్సీలో టీమిండియా మూడు ఐసీసీ టైటిల్స్ గెలిస్తే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా టెస్టుల్లో టాప్ టీమ్‌గా ఎదిగింది. ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, నయా సారథిగా భారత జట్టును నడిపించబోతున్నాడు...

PREV
110
మాహీ కెప్టెన్ కూల్ అయితే విరాట్ కోహ్లీ ఫైర్... రోహిత్ శర్మ వేరే లెవెల్... మాజీ బౌలింగ్ కోచ్...

గత ఐదేళ్లలో భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్‌ యూనిట్ అద్భుత ప్రదర్శనతో విదేశాల్లో అద్వితీయ విజయాలు అందుకోవడంలో కీలక పాత్ర పోషించింది... 

210

మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ వంటి పేసర్లు స్టార్లుగా ఎదిగారు... వీరి విజయంలో టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పాత్ర కూడా ఉంది...

310

దాదాపు ఐదేళ్లు టీమిండియాకి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించి, ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న భరత్ అరుణ్, వచ్చే సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు...

410

తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలతో పాటు నయా సారథి రోహిత్ శర్మ మధ్య తేడాలను వివరించాడు భరత్ అరుణ్...

510

‘నేను ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీని దగ్గర్నుంచి చూశాను. అతను చాలా కూల్. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోను కాడు. కూల్, కామ్, ఇంకా పక్కాగా గేమ్‌ని అర్థం చేసుకునే మైండ్ మాహీది...

610

ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, పరిస్థితులను నిర్ణయాలను మార్చుకుని కొత్త ప్లాన్‌తో ముందుకి వెళ్లడం ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ లక్షణాలు... రిజల్ట్ ఎలా ఉన్నా, దాన్ని స్వీకరించడానికి మాహీ సిద్ధంగా ఉంటాడు...

710

నా దృష్టిలో ప్రధాన మంత్రి తర్వాత భారత క్రికెట్ కెప్టెన్‌గా ఉండే వ్యక్తి, చాలా బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. దాదాపు 100 కోట్లకు పైగా అభిమానులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది...

810

ఎమ్మెస్ ధోనీతో పోలిస్తే విరాట్ కోహ్లీ పూర్తి విరుద్ధమైన వ్యక్తిత్వం కలిగిన కెప్టెన్. అయితే విరాట్ కోహ్లీ క్రీజులోకి వస్తే, ఎలాగైనా గెలవాలని ఫిక్స్ అయి వస్తాడు...

910

విరాట్ కోహ్లీ క్రీజులో ఉంటే ఆ ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంటుంది. అతను ఎప్పుడూ మిగిలినవాళ్లకు ఉదాహరణగా నిలవాలని తాపత్రయపడతాడు. కొండకు ఎదురెళ్లి ఢీకొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాడు...

1010

ఈ ఇద్దరితో పోలిస్తే రోహిత్ శర్మ ఆలోచనా విధానం పూర్తిగా డిఫరెంట్. అతని ఆలోచనలు, కెప్టెన్సీ కూడా పూర్తిగా వేరేగా ఉంటాయి. అయితే రోహిత్ కూడా ఈ ఇద్దరిలాగే సక్సెస్ కాగలడు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్...
 

Read more Photos on
click me!

Recommended Stories