రిషబ్ పంత్‌కి పాజిటివ్, ఐసోలేషన్‌లో వృద్ధిమాన్ సాహా.. వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్?

First Published Jul 16, 2021, 9:40 AM IST

ఇంగ్లాండ్ టూర్‌లో భారత జట్టుకి ఓ వింత సమస్య ఎదురైంది. భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా పాజిటివ్‌గా తేలి, కోలుకుంటుండగా... తాజాగా వృద్ధిమాన్ సాహా కూడా ఐసోలేషన్‌లో చేరాడు...

రిషబ్ పంత్‌తో పాటు భారత జట్టు సహాయ సిబ్బందిలోని ఓ వ్యక్తికి కరోనా సోకిన విషయం తెలిసిందే. భారత జట్టు థ్రోడౌన్ స్పెషలిస్టు దయానంద్ గరాణీకి కరోనా పాజిటివ్‌గా తేలింది...
undefined
దయానంద్‌ను కొన్నిరోజుల కిందటే కలిసిన వృద్ధిమాన్ సాహా కూడా ముందుజాగ్రత్తగా ఐసోలేషన్‌లో చేరాడు. ఐపీఎల్ సమయంలో సాహా కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే.
undefined
భారత జట్టు ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇద్దరూ జట్టుకు దూరంగా ఉండడంతో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్ ప్రాక్టీస్ మ్యాచ్‌కి వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.
undefined
దాదాపు ఏడాదిన్నరగా టెస్టు టీమ్‌లో చోటు కోసం ఎదురుచూస్తున్న కెఎల్ రాహుల్, 20 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా వ్యవహరించబోతున్నట్టు బీసీసీఐ స్పష్టం చేసింది...
undefined
అయితే ప్రస్తుతం కామెంటేటర్‌గా ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, అవసరమైతే తాను కూడా వికెట్ కీపర్‌గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు...
undefined
తన వికెట్ కీపింగ్ కిట్ తనతోనే ఉందని చూపిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అయితే కెఎల్ రాహుల్ అందుబాటులో ఉండడంతో దినేశ్ కార్తీక్‌ను ఉపయోగించేందుకు టీమిండియా సిద్ధంగా లేదు...
undefined
భారత జట్టు తరుపున 26 టెస్టులు ఆడిన దినేశ్ కార్తీక్‌, ఓ సెంచరీతో పాటు 7 హాఫ్ సెంచరీలతో 1025 పరుగులు చేశాడు.
undefined
click me!