Published : Feb 14, 2022, 03:10 PM ISTUpdated : Feb 14, 2022, 03:11 PM IST
గత రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మరింత ఘోరంగా విఫలమవుతున్నాడు. గత ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు సార్లు డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ...
సౌతాఫ్రికా టూర్‌లో రెండో వన్డేలో గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరిన విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో రెండో బంతికి డకౌట్ అయ్యాడు...
210
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో కలిపి 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన 2013 సిరీస్ తర్వాత అతి చెత్త రికార్డు ఇదే...
310
కెఎల్ రాహుల్ గాయం కారణంగా టీ20 సిరీస్ మొత్తానికి దూరం కావడంతో ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ పర్పామెన్స్ కీలకంగా మారనుంది...
410
‘విరాట్ కోహ్లీతో నేను అతని బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడలేదు. ఆ అవసరం కూడా లేదనుకుంటా. ఎందుకంటే గత ఏడాదిగా అతను టీ20ల్లో, వన్డేల్లో బాగానే పరుగులు చేస్తున్నాడు...
510
అవును, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ పరుగులు చేయలేకపోయాడు. అయితే అతని ఫామ్‌పై భయపడాల్సిన అవసరం లేదు. నెట్స్‌లో విరాట్ ఎప్పటిలాగే కఠినంగా శ్రమిస్తున్నాడు..
610
త్వరలోనే అతను తన ఫామ్‌ను అందుకుని ఇరగదీస్తాడని నమ్ముతున్నా... ఇప్పుడు టీమిండియా ఫోకస్ అంతా ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ పైనే ఉంది...
710
కొందరు ప్లేయర్లు గాయాలతో సతమతమవుతుండడం భారత జట్టుకి ఇబ్బంది కలిగించే విషయమే. టీ20 వరల్డ్ కప్ టోర్నీ సమయానికి ఎవరు అందుబాటులో ఉన్నా, బ్యాటింగ్‌లో లోపాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది...
810
అయితే మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్లే గాయపడుతూ జట్టుకి దూరమవుతుండడం, టీమిండియాకి కష్టాలు తెచ్చిపెడుతోంది...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్...
910
సౌతాఫ్రికా టూర్‌కి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయపడ్డాడు. గాయం నుంచి కోలుకోని జడేజా, సౌతాఫ్రికా టూర్‌తో పాటు వెస్టిండీస్ సిరీస్‌కి దూరమయ్యాడు...
1010
అలాగే సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ, ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడి... సఫారీ సిరీస్‌లకు దూరమయ్యాడు. అలాగే కెఎల్ రాహుల్ గాయం కారణంగా విండీస్‌తో టీ20 సిరీస్‌కి దూరమయ్యాడు...