ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన ఈ మెగా వేలంలో రూ.551.7 కోట్లు ఖర్చు కాగా, ఒకే ఒక్క రోజులో కొందరు క్రికెటర్ల జాతకాలే మారిపోనున్నాయి. అయితే ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనా వంటి సీనియర్ క్రికెటర్లను ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు...
10 సీజన్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న సురేష్ రైనా, మూడు టైటిల్స్ అందించాడు. గుజరాత్ లయన్స్‌కి కెప్టెన్‌గా ఉన్న రైనాని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు...
211
పూణే సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లకి కెప్టెన్‌గా వ్యవహరించి, గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడిన స్టీవ్ స్మిత్‌ను కూడా ఏ ఫ్రాంచైజీ కొనుక్కోవడానికి ఆసక్తి చూపించలేదు...
311
బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌తో పాటు సౌతాఫ్రికా సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ కూడా ఈ సారి వేలంలో అమ్ముడుపోలేదు...
411
ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ ఆడమ్ జంపాతో పాటు భారత సీనియర్ మోస్ట్ స్పిన్నర్లు అమిత్ మిశ్రా, పియూష్ చావ్లాలను ఏ ఫ్రాంఛైజీ కొనుక్కోవడానికి ముందుకు రాలేదు...
511
భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మతో పాటు ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్, ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, వరల్డ్ నెం.1 టీ20 బ్యాటర్ డేవిడ్ మలాన్‌లను ఏ జట్టూ పట్టించుకోలేదు...
611
గత సీజన్‌లో కేకేఆర్‌ను ఫైనల్ చేర్చిన ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను కొనుక్కోవడానికి కూడా ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. మోర్గాన్ బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లు అయినా కనీస ధర చెల్లించడానికి కూడా ఫ్రాంఛైజీలు ఇష్టపడలేదు...
711
కేన్ రిచర్డ్‌సన్, కొలిన్ మున్రో, రోస్టన్ ఛేజ్, ఆండ్రూ టైలతో పాటు వరల్డ్ నెం.1 సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీ కూడా ఐపీఎల్ వేలంలో ఏ జట్టునూ ఆకర్షించలేకపోయారు...
811
ధవల్ కుల్‌కర్ణి, సౌరబ్ తివారి, సందీప్ వారియర్, పవన్ నేగి, మహ్మద్ అజారుద్దీన్, రజత్ పటిదార్, విరాట్ సింగ్, సచిన్ బేబీ వంటి ఐపీఎల్ అనుభవం ఉన్న ప్లేయర్లను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు...
911
న్యూజిలాండ్ సీనియర్ స్పిన్నర్ ఇష్ సోదీ, సీనియర్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్, ఆఫ్ఘాన్ స్పిన్నర్లు, జింబాబ్వే ప్లేయర్ బ్లెసింగ్ ముజర్‌బానీలను ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు...
1011
గతంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకి ఆడిన భారత ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌తో పాటు మురళీ విజయ్, 8 ఏళ్ల తర్వాత వేలానికి షార్ట్ లిస్ట్ చేయబడిన శ్రీశాంత్ పేర్లు వేలానికి కూడా రాలేదు...
1111
తొలి రౌండ్‌లో అమ్ముడుపోని ఉమేశ్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్, జేమ్స్ నీశమ్, సామ్ బిల్లింగ్స్ వంటి స్టార్ ప్లేయర్లు, ఆఖరి రౌండ్‌లో అమ్ముడుపోయారు...