ఫామ్‌లోకి వచ్చినట్టే వచ్చి! విరాట్ కోహ్లీ మళ్లీ అదే తీరు... 8 ఏళ్ల తర్వాత ఓపెనర్‌గా వచ్చి...

First Published Dec 7, 2022, 5:26 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియాలో విరాట్ కోహ్లీ ప్లేస్ గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. అయితే ఆసియా కప్‌లో అద్భుత ఆటతీరు చూపించిన విరాట్ కోహ్లీ, ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసి మూడేళ్లుగా దక్కని 71వ శతకాన్ని అందుకున్నాడు.. అయితే విరాట్ కోహ్లీ నిజంగా ఫామ్‌లోకి వచ్చాడా?

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో నాలుగు హాఫ్ సెంచరీలతో 296 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అయితే తాను ఫామ్‌లోకి వచ్చింది టీ20ల్లో మాత్రమేనని, వన్డేల్లో కాదని నిరూపించుకుంటున్నాడు విరాట్ కోహ్లీ...

తొలి వన్డేలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చి 15 బంతుల్లో 9 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, బంగ్లా సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... రెండో వన్డేలో 6 బంతులాడి 5 పరుగులు చేసి ఎడబత్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు విరాట్...

Image credit: Getty

2008లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఏడాదిలో టీమిండియాకి వన్డేల్లో ఓపెనింగ్ చేశాడు విరాట్ కోహ్లీ... 2014లో న్యూజిలాండ్‌తో వన్డేలో ఆఖరిగా ఓపెనింగ్‌కి వచ్చాడు. ఓవరాల్‌గా వన్డేల్లో 6 సార్లు ఓపెనింగ్ చేసిన విరాట్ కోహ్లీ 161 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఓపెనర్‌గా మంచి రికార్డు కూడా లేదు... 

Image credit: PTI

రోహిత్ అందుబాటులో లేకపోవడంతో ఓపెనింగ్ చేసిన విరాట్ కోహ్లీ, గత ఏడు వన్డేల్లో 20+ స్కోరు కూడా చేయలేకపోయాడు. గత ఏడు వన్డేల్లో విరాట్ కోహ్లీ 8, 18, 0, 16, 17, 9, 5 పరుగులు చేశాడు. నాలుగు సార్లు సింగిల్ డిజిట్ స్కోరు చేయలేకపోయిన విరాట్, మూడు సార్లు 20+ స్కోరు కూడా చేయలేదు..

విరాట్ కోహ్లీ టీ20ల్లో ఫామ్‌లోకి వచ్చినా వన్డేల్లో మాత్రం పాత ఫెయిల్యూర్ కొనసాగుతోందని మరోసారి నిరూపితమైంది. విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత కొద్దిసేపటికే శిఖర్ ధావన్, వాషింగ్టన్ సుందర్ అవుట్ కావడంతో 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. తొలి వన్డేలో వికెట్ తేడాతో పరాజయాన్ని అందుకున్న భారత జట్టు, నేటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ నిలెబట్టుకోవాలంటే 272 పరుగుల భారీ స్కోరు చేయాల్సి ఉంది.. 

click me!