ఒకే రోజు మూడు పిట్టలు! రోహిత్ శర్మ, కుల్దీప్ సేన్, దీపక్ చాహార్... రెండో వన్డేలో ముగ్గురికి గాయాలు...

First Published Dec 7, 2022, 5:05 PM IST

ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్, బంగ్లాదేశ్‌ టూర్... సిరీస్ ఏదైనా టీమిండియాని గాయాల బెడద మాత్రం వదలడం లేదు. ఇప్పటికే జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి స్టార్ ప్లేయర్లు ఎప్పుడు కోలుకుంటారో? ఎప్పటికి టీమిండియాకి అందుబాటులోకి వస్తాయో చెప్పలేని పరిస్థితి. తాజాగా ఈ లిస్టులోకి మరో ముగ్గురు చేరారు...

Image credit: PTI

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కి ఎంపికైన యష్ దయాల్ గాయపడడంతో అతని స్థానంలో టీమ్‌లోకి స్థానం సంపాదించుకున్నాడు కుల్దీప్ సేన్. బంగ్లాతో తొలి వన్డేలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి 5 ఓవర్లలో 37 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు...

kuldeep sen

తొలి వన్డేలో ఇంప్రెసివ్‌ బౌలింగ్‌తో ఆకట్టుకున్న కుల్దీప్ సేన్‌కి రెండో వన్డేలో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీమ్ సెలక్షన్‌కి కుల్దీప్ సేన్ అందుబాటులో లేని కారణంగా ఉమ్రాన్ మాలిక్‌‌కి అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...

ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయంతో బయటికి వెళ్లాడు. మహ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి అనమోల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ని అందుకునే ప్రయత్నంలో రోహిత్ శర్మ చేతికి గాయమైంది...

ఈ గాయం తీవ్రత తేల్చేందుకు వైద్యులు, స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. ఫలితంగా రోహిత్ శర్మ బ్యాటింగ్‌కి కూడా రాలేదు. రోహిత్ స్థానంలో శిఖర్ ధావన్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేశాడు..  కొద్దిసేపటికే దీపక్ చాహార్ కూడా గాయంతో పెవిలియన్ చేరాడు...

Image credit: PTI

3 ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చిన దీపక్ చాహార్, తొడ కండరాలు పట్టేయడంతో మళ్లీ బౌలింగ్‌కి రాలేదు. దీపక్ చాహార్ అందుబాటులో లేని కారణంగా సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ పదేసి ఓవర్లు వేయగా అక్షర్ పటేల్ 7 ఓవర్లు బౌలింగ్ చేశాడు...

Image credit: Getty

దీపక్ చాహార్ గాయపడి జట్టుకి దూరం కావడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి. గాయంతో ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమైన దీపక్ చాహార్, సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో గాయపడి... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడు. తాజాగా మరోసారి చాహార్ గాయపడ్డాడు.. 

Deepak Chahar

ఒకే మ్యాచ్‌లో కుల్దీప్ సేన్ వెన్నెనొప్పితో బాధపడుతుంటే, రోహిత్ శర్మ చేతికి ఫ్యాక్చర్ అయ్యిందేమోనని డాక్టర్లు అనుమానిస్తున్నారు. రిపోర్టులు వచ్చేదాకా రోహిత్ తీవ్రత తెలీదు. తొడ కండరాలు పట్టేయడంతో ఫీల్డ్ వదిలిన దీపక్ చాహార్.. మరో రెండు మూడు వారాల పాటు జట్టుకి దూరం కాబోతున్నాడు.. 

click me!