అతడొస్తే మీ ఇద్దరి ప్లేసులూ గోవిందా.. జాగ్రత్తగా ఆడండి.. రాహుల్, శ్రేయాస్‌లకు గవాస్కర్ హెచ్చరిక

First Published Dec 7, 2022, 4:30 PM IST

వచ్చే ఏడాది   భారత్ వేదికగా జరుగబోయే వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని  టీమిండియా  వన్డే సిరీస్ లలో పలు కీలక మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మిడిలార్డర్ లో  శ్రేయాస్ అయ్యర్ తో పాటు టీమిండియా  వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ లు తమ ప్లేస్ లను కన్ఫర్మ్ చేసుకునే పనిలో ఉన్నారు. 

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న  భారత జట్టు  ఆడిన తొలి వన్డేలో చివరి మెట్టు వద్ద చతికిలపడగా రెండో వన్డేలో  బౌలర్లు టాపార్డర్ ను కత్తిరించినా మిడిలార్డర్ ను ఔట్ చేయలేక ఇబ్బందులు పడ్డారు.  మరి ఈ మ్యాచ్ లో అయినా  టీమిండియా బ్యాటర్లు తొలి వన్డేలో మాదిరిగా  విఫలం కాకుండా ఉండాలని  టీమిండియా ఫ్యాన్స్  కోరుకుంటున్నారు. 

వచ్చే ఏడాది   భారత్ వేదికగా జరుగబోయే వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని  టీమిండియా  వన్డే సిరీస్ లలో పలు కీలక మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే వన్డే  వరల్డ్ కప్ ప్రణాళికలను  సిద్ధం చేసిన టీమిండియా.. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో  వాటిని అమలుపరిచి బోల్తా కొట్టింది.   

ఓపెనర్ల విషయంలో భారత్ కు ఇబ్బంది ఏమీ లేకపోయినా  మిడిలార్డర్ విషయంలో  ఆటగాళ్ల మధ్య చాలా  పోటీ ఉంది.  ప్రస్తుతానికి టీమిండియా మిడిలార్డర్ లో కోహ్లీ,  శ్రేయాస్,  సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, అప్పుడప్పుడు దీపక్ హుడాలకు అవకాశమిస్తున్నది. 
 

అయితే వీరిలో నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చే  శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ లు తమ స్థానాలను కాపాడుకోవడానికి చాలా కష్టపడాలని, టీమిండియా తరఫున టీ20లలో అదరగొడుతూ  కాబోయే కెప్టెన్  రేసులో ఉన్న హార్థిక్ పాండ్యా వన్డేలకు వస్తే మాత్రం ఈ ఇద్దరికీ తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నాడు. 

బంగ్లాదేశ్ తో రెండో వన్డేకు ముందు గవాస్కర్ సోనీ స్పోర్ట్స్ షో లో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతానికి మిడిలార్డర్ లో  రాహుల్, అయ్యర్ లు  జట్టులో చోటు దక్కించుకుంటున్నారు.  అయితే వాళ్లు ఏ మ్యాచ్ కూడా తేలికగా తీసుకోవడానికి లేదు. ఈ ఇద్దరూ  ప్రతీ మ్యాచ్ లోనూ రాణించాలి.  

ప్రస్తుతానికి రెస్ట్ ఇచ్చినా  హార్ధిక్ పాండ్యా  త్వరలోనే వన్డేలలో కూడా ఆడతాడు. వన్డే ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో అతడు చాలా కీలక ఆటగాడు. ఆల్ రౌండర్ గా రాణించే పాండ్యా  కోసం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బెంచ్ కు పరిమితమవక తప్పదు. అయితే కెఎల్ రాహుల్ కీపింగ్ చేయగలడు కాబట్టి అతడిని  టీమ్ లో కొనసాగించినా   శ్రేయాస్  కు మాత్రం కష్టమే.  అతడు ప్రతీ మ్యాచ్ లో తనను తాను నిరూపించుకోవాలి. లేకుంటే తిప్పలు తప్పవు..’ అని అన్నాడు. 

ఈ ఏడాది   శ్రేయాస్ వన్డేలలో   15 మ్యాచ్ లు ఆడి 639 పరుగులు చేశాడు.  ఇందులో ఒక సెంచరీతో పాటు  ఐదు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.  మరోవైపు రాహుల్.. 8 వన్డేలలో 229 పరుగులు చేశాడు.  ఇందులో రెండు హాఫ్  సెంచరీలున్నాయి. ఈ ఏడాది జూన్ లో  హార్ధిక్ పాండ్యా.. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్ లు ఆడాడు. తర్వాత టీ20లకే పరిమితమయ్యాడు. 

click me!