విరాట్ కోహ్లీకి ఆ సమస్య ఉంది, కానీ రోహిత్ శర్మ మాత్రం అద్భుతం... - సచిన్ టెండూల్కర్...

Published : Aug 22, 2021, 12:45 PM IST

రెండేళ్ల ముందు వరకూ ఫార్మాట్‌తో సంబంధం లేకుండాసెంచరీల మోత మోగించాడు విరాట్ కోహ్లీ... వన్డే, టెస్టుల్లో కలిపి 70 సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, 71వ సెంచరీ మార్కు అందుకోవడానికి మాత్రం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. తాజాగా విరాట్ కోహ్లీ విఫలం కావడానికి కారణాలను వివరించాడు సచిన్ టెండూల్కర్...

PREV
17
విరాట్ కోహ్లీకి ఆ సమస్య ఉంది, కానీ రోహిత్ శర్మ మాత్రం అద్భుతం... - సచిన్ టెండూల్కర్...

2014 ఇంగ్లాండ్ టూర్‌లో ఘోరంగా విఫలమైన విరాట్ కోహ్లీ, 2018లో మాత్రం ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు. 2021 సీజన్‌ మొదటి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన కోహ్లీ... రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 62 పరుగులు చేశాడు...

27

‘విరాట్ కోహ్లీ చక్కని బ్యాట్స్‌మెన్. అయితే ఎంతటి బ్రిలియెంట్ బ్యాట్స్‌మెన్‌కి అయినా ఓపెనింగ్ చాలా ముఖ్యం. ఇప్పటివరకూ విరాట్ కోహ్లీకి సరైన ఆరంభం దక్కలేదు. అందుకే అతను ఇబ్బంది పడుతున్నాడు...

37

బ్యాట్స్‌మెన్‌కి టెక్నిక్‌తో పాటు ఆలోచనా విధానం కూడా చాలా అవసరం. ఇన్నింగ్స్ ఆరంభంలో బంతులను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడితే, అది అతనిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుంది...

47

ఫామ్‌లో లేకపోతే ఆ బ్యాట్స్‌మెన్‌పై అనేక విషయాలు ఎఫెక్ట్ చూపిస్తాయి. కొన్నిసార్లు శరీరం కూడా సరిగా సహకరించదు. అందుకే విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా భారీ స్కోరు సాధించలేకపోయాడు...

57

రోహిత్ శర్మ చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పటిదాకా అతను ఆడిన ఇన్నింగ్స్‌లు చాలా విలువైనవి. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు చేస్తూ, ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతున్నాడు...

67

రోహిత్ శర్మకి, కెఎల్ రాహుల్ నుంచి కూడా మంచి సహకారం అందుతోంది. ఈ టూర్‌లో ఫుల్‌ షాట్స్ ఆడి రెండు సార్లు అవుట్ అయ్యాడు రోహిత్. అయితే అతనికి ఫుల్ షాట్స్ ఆడిన అనుభవం చాలా ఉంది. ఏ బంతిని ఆడాలి, ఏ బంతిని వదిలేయాలనే విషయంపై అతనికి మంచి క్లారిటీ కూడా ఉంది...

77

ఇప్పటిదాకా ఇంగ్లాండ్‌లో రోహిత్ శర్మ ఆడిన విధానం బాగుంది. ఇలాగే ఆడితే అతను కచ్ఛితంగా మిగిలినవారి కంటే మెరుగ్గా రాణించగలడు. నాకు తెలిసి, ఈ టూర్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్...

click me!

Recommended Stories