అన్నీ బాగున్నా, ఆ విషయంలో భయపడుతున్న ఆర్‌సీబీ ఫ్యాన్స్... హసరంగకి మాత్రం అది ఇవ్వొద్దంటూ...

First Published Aug 22, 2021, 11:26 AM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఐపీఎల్ చరిత్రలో ఈ టీమ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ మరే టీమ్‌కి ఉండదేమో. ఎందుకంటే విజయాలు వస్తూ, టైటిల్స్ సాధిస్తున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉండడం పెద్ద విషయమేమీ కాదు... అయితే వరుసగా ఫెయిల్ అవుతున్నా, ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తున్నా ఆర్‌సీబీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు...

ప్రతీ సీజన్ ఆరంభానికి ముందు ‘ఈ సాల్ కప్ నమ్‌దే’ అంటూ రాయల్ ఛాలెంజర్స్ టీమ్, వారి ఫ్యాన్స్... కప్పు గెలిచేసే రేంజ్‌లో హడావుడి చేయడం... సీజన్ మొదలయ్యాక టీమ్ పర్ఫామెన్స్ చూసి... నిరాశగా చల్లారిపోవడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతూనే ఉంది...

అయినా ఐపీఎల్ ఆరంభమవుతుందంటే అదే ఊపు, అదే జోరు, అదే నినాదం... ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అదిరిపోయే పర్ఫామెన్స్‌తో సీజన్‌ను ఆరంభించింది...

మొదటి మ్యాచ్‌‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన ఆర్‌సీబీ, ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్‌, రాజస్థాన్ రాయల్స్‌ జట్లపై అద్భుత విజయాలు అందుకుంది...

వరుసగా నాలుగు విజయాలు సాధించి, ఊపుమీదున్న ఆర్‌సీబీకి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదురైంది. ఆ తర్వాత ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో ఉత్కంఠ విజయం అందుకుని ఊపిరి పీల్చుకుంది..

పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఓడిన ఆర్‌సీబీ... ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఫేజ్ 2లో శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వానిండు హసరంగను జట్టులోకి తీసుకొచ్చింది ఆర్‌సీబీ...

ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో హసరంగను తీసుకుంది ఆర్‌సీబీ. అయితే హసరంగను తీసుకోవడంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సంతోషంగానే ఉన్నా, ఓ విషయం మాత్రం వారిని తీవ్రంగా కలిచివేస్తోంది...

అదే హసరంగ జెర్సీ నెంబర్. శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగ జెర్సీ నెంబర్ 49. అతని బెస్ట్ బౌలింగ్ గణాంకాలు కూడా 4/9... యాదృచ్ఛికంగా ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యల్పంగా 49 పరుగులే చేసింది ఆర్‌సీబీ...

2017 సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ను మరిచిపోవాలని అనుకుంటారు ఆర్‌సీబీ ఫ్యాన్స్. అయితే 49 సంఖ్య ఓ పీడకలలా మారి, వారిని వెంటాడుతూనే ఉంది... తాజాగా హసరంగ జెర్సీ నెంబర్ కూడా అదే...

ఏదిఏమైనా ఆర్‌సీబీలో హసరంగకి ఆ జెర్సీ నెంబర్ ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. దాని స్థానంలో ఏ నెంబర్ జెర్సీ ఇచ్చినా ఒకే అంటున్నారు..

ఇందులో మరో విశేషం ఏంటంటే... ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, తమ మొదటి మ్యాచ్‌ కేకేఆర్‌తోనే ఆడబోతుండడం... దీంతో మిగిలిన జట్ల అభిమానులు మాత్రం ఈ ఫీట్ మళ్లీ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు...

click me!