అప్పుడు సౌరవ్ గంగూలీ, ఇప్పుడు విరాట్... ఇద్దరిదీ ఒకే కథ! దాదాలా కోహ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వగలడా...

Published : Jul 09, 2022, 08:28 PM IST

విరాట్ కోహ్లీ... సోషల్ మీడియాలో వందల మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఏకైక క్రికెటర్. ప్రస్తుత తరంలో అత్యధిక సెంచరీలు, అత్యధిక అంతర్జాతీయ పరుగులు ఉన్న క్రికెటర్... అయితే అవన్నీ గతం! ఇప్పుడు విరాట్ కోహ్లీ, జట్టుకి భారంగా మారిన ఓ సీనియర్ క్రికెటర్...

PREV
18
అప్పుడు సౌరవ్ గంగూలీ, ఇప్పుడు విరాట్... ఇద్దరిదీ ఒకే కథ! దాదాలా కోహ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వగలడా...
Image credit: Getty

కొన్నాళ్లుగా పరుగులు చేయడంలో వరుసగా విఫలమవుతూ టీమ్‌లో చోటు కోల్పోయే పరిస్థితికి తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో 1 పరుగుకే అవుటైన విరాట్ కోహ్లీ, రెండో టీ20లో ఫెయిల్ అయితే.. అతని టీ20 కెరీర్‌కి దాదాపు శుభం కార్డు పడినట్టే...

28
Image credit: Getty

దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్ లాంటి యంగ్ క్రికెటర్లు.. టాపార్డర్‌లో రాణిస్తూ విరాట్ కోహ్లీ పొజిషన్‌కి చెక్ పెడుతున్నారు. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 వంటి మెగా టోర్నీలకు పెద్దగా సమయం లేకపోవడంతో ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీని ఆడించడం కంటే ఫామ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్లను ఆడిస్తే బెటర్ అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్... టీ20ల్లో చోటు కోల్పోతే టెస్టు, వన్డేల్లో ప్లేస్ కోల్పోడానికి ఎక్కువ సమయమేమీ పట్టదు..

38
Sourav Ganguly-Virat Kohli

టీమిండియాకి టెస్టు సారథిగా, మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా అదిరిపోయే విజయాలు అందించిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రస్తుత సారథి సౌరవ్ గంగూలీ ఫేస్ చేసిన పొజిషన్‌లోనే ఉన్నాడు..

48

2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకి హెడ్ కోచ్‌గా వచ్చిన గ్రెగ్ ఛాపెల్, పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ జట్టుకి భారంగా మారిన అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ తర్వాత తుదిజట్టు నుంచి తప్పించాడు...
 

58

ఆ సమయంలో టీమిండియాలో ఓ తిరుగులేని శక్తిగా ఉన్న సౌరవ్ గంగూలీ, తుదిజట్టులో చోటు కోల్పోయిన తర్వాత కసిగా ప్రాక్టీస్ చేసి, దేశవాళీ టోర్నీల్లో రాణించి తిరిగి తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు... పేలవ ఫామ్, వరుస వైఫల్యాలతో ఆ సమయంలోనే ఎన్నో ట్రోల్స్ ఫేస్ చేసిన గంగూలీ, కమ్‌బ్యాక్ తర్వాత ఓ క్లీన్ క్రికెటర్‌గా కనిపించాడు...

68

అప్పుడు సౌరవ్ గంగూలీ ‘ప్రిన్స్’గా కీర్తిని గడిస్తే,ఇప్పుడు ‘కింగ్’ విరాట్ కోహ్లీ పొజిషన్ కూడా అదే. శతకాల మోతతో ఓ స్థాయికి చేరుకున్న విరాట్ కోహ్లీ, ఇప్పుడు గంగూలీ ఫేస్ చేసిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతోనే జట్టులో తన ప్రభావాన్ని కోల్పోయాడు విరాట్ కోహ్లీ... 

78

జట్టు కంటే ఏ ప్లేయర్ కూడా ఎక్కువ కాడు, కాబోడు. సచిన్ టెండూల్కర్ ఈ విషయాన్ని కెరీర్ ఆసాంతం గుర్తుపెట్టుకున్నాడు కాబట్టే ‘క్రికెట్ గాడ్’గా కీర్తిగడించినా నిత్య విద్యార్థిలా మెదులుకున్నాడు. అయితే అప్పుడు సౌరవ్ గంగూలీ కానీ,ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ టీమ్ కంటే తమ స్థాయి ఎక్కువనే మదాన్ని తలకి ఎక్కించుకున్నవాళ్లే... 

88

వన్డే కెప్టెన్సీ కోల్పోయి, ఆ అవమాన భారంతో టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ... టీ20 వరల్డ్ కప్ 2022 ఆడతాడా? అనేది అనుమానంగా మారింది. ఒకవేళ టీమ్‌లో చోటు కోల్పోతే, గంగూలీలా తిరిగి జట్టులోకి రాగలడా? అనేది కూడా సెంచరీ సెంచరీల ప్రశ్నే..

Read more Photos on
click me!

Recommended Stories