ఆ విషయంలో అర్ష్‌దీప్ సింగ్‌కి అన్యాయం... ఆరంగ్రేటం మ్యాచ్‌లో ఆ లెవెల్‌లో అదరగొట్టినా...

Published : Jul 09, 2022, 07:12 PM IST

టీమిండియాలో చోటు కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడు యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కి, ఆ తర్వాత ఐర్లాండ్ టూర్‌కి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు ఈ పంజాబ్ కింగ్స్ బౌలర్. ఎట్టకేలకు ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో అర్ష్‌దీప్ సింగ్‌కి అవకాశం దక్కింది... 

PREV
16
ఆ విషయంలో అర్ష్‌దీప్ సింగ్‌కి అన్యాయం... ఆరంగ్రేటం మ్యాచ్‌లో ఆ లెవెల్‌లో అదరగొట్టినా...
Arshdeep Singh

అంతర్జాతీయ కెరీర్‌ని మెయిడిన్ ఓవర్‌తో ప్రారంభించిన అర్ష్‌దీప్ సింగ్.. పవర్ ప్లే రెండో ఓవర్‌లో జాసన్ రాయ్‌కి భారీ షాట్లు ఆడకుండా కట్టడి చేయగలిగాడు. రెండో ఓవర్‌లో 11 పరుగులిచ్చిన అర్ష్‌దీప్ సింగ్.. తన మూడో ఓవర్‌లో 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు...

26

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో మూడో బంతికి వికెట్ తీసిన అర్ష్‌దీప్ సింగ్, తన ఆరంగ్రేట మ్యాచ్‌లో 3.3 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి ఇంప్రెసివ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు... అయితే అలాంటి పర్ఫామెన్స్ తర్వాత కూడా అర్ష్‌దీప్ సింగ్, రెండో టీ20లో తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోవడం హాట్ టాపిక్ అయ్యింది...

36

రెండో టీ20లో జస్ప్రిత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌, రవీంద్ర జడేజాలకు తుదిజట్టులో చోటు కల్పించిన భారత జట్టు... ఇషాన్ కిషన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌లను పక్కనబెట్టింది...

46

తొలి టీ20లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా రెండో టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు అర్ష్‌దీప్ సింగ్. దీనికి ప్రధాన కారణం టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే జట్టుతో బరిలో దిగాలని టీమిండియా భావించడమే...

56

టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో ఆడించాలని అనుకున్న కొంతమంది ప్లేయర్లకు మాత్రమే వరుస అవకాశాలు ఇస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్... సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ వంటి ప్లేయర్లు ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇస్తున్నా, వారిని పెద్దగా వాడుకోవడంపై ఆసక్తి చూపించడం లేదు.

66
Deepak Hooda

ఐర్లాండ్ టూర్‌లో, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో అదరగొట్టినప్పటికీ ఆల్‌రౌండర్ దీపక్ హుడాకి రెండో టీ20లో చోటు ఇవ్వకపోవడం కూడా అన్యాయమంటున్నారు టీమిండియా అభిమానులు... 

click me!

Recommended Stories