చెన్నై సూపర్ కింగ్స్‌కి రవీంద్ర జడేజా గుడ్‌బై!? ఇన్‌స్టాలో ఆ పోస్టులను తొలగించడంపై...

First Published Jul 9, 2022, 5:37 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ని ఎన్నో ఆశలతో ఆరంభించిన రవీంద్ర జడేజా... ఘోర పరాభవం, అవమానాలతో సీజన్ మధ్యలో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది... సీజన్ ఆరంభంలో చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న జడ్డూ, వచ్చే  సీజన్‌లో కొత్త టీమ్‌కి ఆడబోతున్నాడా? అవుననే అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఎమ్మెస్ ధోనీ. దీంతో ఎప్పటి నుంచే సీఎస్‌కే తర్వాతి కెప్టెన్ నేనే అంటూ ప్రకటించుకుంటూ వచ్చిన జడేజాకి కెప్టెన్సీ అప్పగించింది ఆ ఫ్రాంఛైజీ...

Ravindra Jadeja

అయితే కీ ప్లేయర్లు గాయం కారణంగా తప్పుకోవడంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుస పరాజయాలను అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. కెప్టెన్సీ ప్రెషర్‌తో రవీంద్ర జడేజా.. అటు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ఆఖరికి ఫీల్డింగ్‌లో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

Latest Videos


పేరుకి రవీంద్ర జడేజా కెప్టెన్ అయినా ఫీల్డింగ్ మార్పుల దగ్గర్నుంచి, బౌలింగ్ మార్పుల దాకా అన్నింటినీ ఎమ్మెస్ ధోనీయే దగ్గరుండి చూసుకునేవాడు. జడేజా కేవలం నామమాత్రపు కెప్టెన్‌గా మిగిలిపోయాడు...

8 మ్యాచుల్లో రెండే రెండు విజయాలు అందుకుని, 6 పరాజయాలు అందుకున్న తర్వాత సీఎస్‌కే కెప్టెన్సీలో మార్పులు చేసింది మేనేజ్‌మెంట్. రవీంద్ర జడేజా స్వచ్ఛందంగా కెప్టెన్సీ వదులుకున్నాడని, ఆ బాధ్యతలను తిరిగి ధోనీయే నిర్వహించబోతున్నాడని ప్రకటించింది...
 

Ravindra Jadeja

అయితే జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోలేదని, టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని కావాలని తప్పించిందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత రవీంద్ర జడేజా కెప్టెన్సీ గురించి ఎమ్మెస్ ధోనీ చులకనగా వ్యాఖ్యలు చేయడంతో జడ్డూ మరింత ఫీల్ అయ్యాడని ప్రచారం జరిగింది...

Ravindra Jadeja

సీజన్ మధ్యలోనే గాయం వంకతో రవీంద్ర జడేజా తప్పుకోవడంతో ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్టైంది. అయితే సీఎస్‌కే మేనేజ్‌మెంట్ మాత్రం జడేజాతో ఎలాంటి విభేదాలు లేవని, అతను వచ్చే సీజన్‌లో ప్లేయర్‌గా టీమ్‌లో ఉంటాడని ప్రకటించింది... ఐపీఎల్ 2022 సమయంలో సీఎస్‌కే అధికారిక ఖాతా.. రవీంద్ర జడేజాని అన్‌ఫాలో చేయడం చాలా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది..

తాజాగా రవీంద్ర జడేజా, తన ఇన్‌స్ట్రాగ్రామ్ నుంచి సీఎస్‌కేకి సంబంధించిన పోస్టులన్నింటికీ డిలీట్ చేశాడు. దీంతో వచ్చే సీజన్‌లో జడ్డూ, సీఎస్‌కేకి ఆడడం అనుమానమే అంటున్నారు అభిమానులు... 10 సీజన్లుగా చెన్నైకి ఆడుతున్న తనను, బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించడంపై జడ్డూ ఫీల్ అయ్యాడని అంటున్నారు...

ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడిన రవీంద్ర జడేజా, డబ్బులు ఎక్కువ ఇవ్వడం లేదనే కారణంగా టీమ్ మారేందుకు ప్రయత్నాలు చేసి ఏడాది నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత 10 సీజన్ల పాటు సీఎస్‌కేకి ఆడిన జడ్డూ, మరో 10 ఏళ్లు ఆడతానని ఇంతకుముందు సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం విశేషం...

ఇప్పటికే ఫాఫ్ డుప్లిసిస్, శార్దూల్ ఠాకూర్ వంటి కీలక ప్లేయర్లు వేరే టీమ్స్‌కి వెళ్లిపోవడంతో విజయాలు అందుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది చెన్నై సూపర్ కింగ్స్... జడ్డూ కూడా సీఎస్‌కేని వీడితే, ఆ టీమ్‌ కష్టాలు మరిన్ని పెరుగుతాయి..

2012లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రూ.12 కోట్ల 80 లక్షలు పెట్టి మరీ కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 2022 సీజన్‌లో మాహీకి రెండో రిటెన్షన్ ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్, జడ్డూని రూ.16 కోట్లకు రిటైన్ చేసుకుంది...

click me!