ఆ రెండు ఫిక్స్, మిగిలిన వాటి కోసం ఫైట్! ఆఫ్ఘాన్ వరుస విజయాలతో ఆసక్తికరంగా మారిన సెమీస్ రేసు...

First Published | Oct 31, 2023, 4:26 PM IST

2019 వన్డే వరల్డ్ కప్‌ లీగ్ స్టేజీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్. అయితే 2023 వన్డే వరల్డ్ కప్‌లో గత నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు అందుకుని, కింగ్ మేకర్‌గా మారింది ఆఫ్ఘాన్..
 

India vs England

మొదటి 6 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న టీమిండియా, మిగిలిన 3 మ్యాచుల్లో ఓడినా సెమీ ఫైనల్ చేరేందుకు 99 శాతం ఛాన్సులు ఉన్నాయి. మరో మ్యాచ్ గెలిస్తే, మిగిలిన జట్లతో సంబంధం లేకుండా సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది టీమిండియా..

రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా 6 మ్యాచుల్లో 5 విజయాలు అందుకుంది. సౌతాఫ్రికా సెమీస్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి తీరాలి. తర్వాతి మ్యాచుల్లో న్యూజిలాండ్, ఇండియా, ఆఫ్ఘాన్‌లతో మ్యాచులు ఆడుతోంది సఫారీ టీమ్... 
 

Latest Videos


New Zealand vs Afghanistan

మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 6 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుంది. కివీస్ సెమీస్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో కనీసం రెండు విజయాలు అందుకోవాల్సి ఉంటుంది. సౌతాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక జట్లతో మ్యాచులు ఆడుతున్న న్యూజిలాండ్.. సెమీస్ చేరేందుకు 77 శాతం ఛాన్సులు ఉన్నాయి..

వరుసగా మొదటి 2 మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలతో కమ్‌బ్యాక్ ఇచ్చింది. తర్వాతి మ్యాచుల్లో ఇంగ్లాండ్, ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్‌లతో మ్యాచులు ఆడబోతోంది ఆస్ట్రేలియా. ఈ మూడు మ్యాచుల్లో కనీసం రెండు గెలిస్తే ఆసీస్ సెమీస్ చేరుతుంది..
 

6 మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న ఆఫ్ఘాన్.. ఐదో స్థానంలో నిలిచింది. ఆఫ్థాన్‌ తర్వాతి మ్యాచుల్లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో మ్యాచులు ఆడుతోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ గెలిస్తే... తర్వాతి మ్యాచుల్లో రెండు బలమైన టీమ్స్‌తో తలబడాల్సి ఉంటుంది..
 

నవంబర్ 7న ముంబైలో ఆస్ట్రేలియాతో, నవంబర్ 10న అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో మ్యాచులు ఆడాల్సి ఉంది ఆఫ్ఘాన్. ఈ రెండు టీమ్స్‌లో ఒక్కదాన్ని ఆఫ్ఘాన్ ఓడించినా... సెమీస్ లెక్కలన్నీ తారుమారైపోతాయి. ఆఫ్ఘాన్ సెమీస్ ఛాన్సులు పెరిగి... ఆ టీమ్ చేతుల్లో ఓడిన టీమ్‌ ఛాన్స్‌లు తగ్గుతాయి..
 

Pakistan vs Afghanistan

ఆఫ్ఘాన్‌ వరుస విజయాల కారణంగా 6 మ్యాచుల్లో రెండేసి విజయాలు అందుకున్న పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌కి కూడా ఇంకా సెమీస్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి.

ఈ మూడు జట్లలో ఏ జట్టు మిగిలిన మూడు మ్యాచుల్లో విజయాలు అందుకున్నా.. టాప్ 4లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ సెమీస్ బెర్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. 
 

click me!