టైగర్ వుడ్స్, మహమ్మద్ ఆలీ, విరాట్ కోహ్లీ... ముగ్గురూ ఒక్కటే! జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా...

Published : Aug 14, 2022, 03:42 PM IST

కెరీర్ పీక్ స్టేజీలోకి వెళ్లిన సమయంలో ఫామ్ కోల్పోయాడు విరాట్ కోహ్లీ. జెట్ స్పీడ్‌తో క్రికెట్ పండితులు కూడా ఆశ్చర్యపోయేలా 70 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు ఒక్క సెంచరీ... ఒక్కటంటే ఒక్క సెంచరీ చేయడానికి అష్టకష్టాలు పడుతున్నాడు...

PREV
16
టైగర్ వుడ్స్, మహమ్మద్ ఆలీ, విరాట్ కోహ్లీ... ముగ్గురూ ఒక్కటే! జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా...
team india

ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా టూర్ తర్వాత వరుసగా సిరీస్‌లు గెలుస్తూ పోతున్న భారత జట్టు, ఇంగ్లాండ్ టూర్‌లో, వెస్టిండీస్ టూర్‌లలో వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుని, జింబాబ్వే గడ్డ మీద అడుగుపెట్టింది...

26
sikandar raza

ఆగస్టు 18 నుంచి జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్ ఆరంభానికి ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా...

36
Virat Kohli

‘విరాట్ భాయ్ అన్ని ఫార్మాట్లు ఆడగల చాలా రేర్ ప్లేయర్. నా ఉద్దేశంలో టైగర్ వుడ్స్ (అమెరికన్ లెజెండరీ గోల్ఫర్), మహమ్మద్ ఆలీ (ది గ్రేట్ బాక్సర్), విరాట్ కోహ్లీ ముగ్గురూ ఒకే కోవకు చెందినవాళ్లు.. ఈ ముగ్గురూ ఆటలో సంచలన మార్పులు తీసుకొచ్చారు. 

46
Virat Kohli

వీళ్లు ఆటలో సరికొత్త పంథాలను తీసుకొచ్చారు. వాళ్లను అందరూ ఫాలో అయ్యేలా చేశారు. క్రికెట్‌లో ఫిట్‌నెస్ చాలా అవసరం. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ను భారత ఆటగాళ్లకు ప్రమాణీకంగా మార్చాడు. అతన్ని మిగిలిన యువ క్రికెటర్లు అందరూ ఫాలో అయ్యేలా మార్పు తీసుకురాగలిగాడు...

56

ఇప్పటి క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై ఇంతటి శ్రద్ధ చూపిస్తున్నారంటే దానికి క్రెడిట్ విరాట్ కోహ్లీకే దక్కాలి... విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్‌కి సలహా ఇచ్చే పొజిషన్ కానీ, అనుభవం కానీ నాకు లేదు...

66
Virat Kohli

ఆయన ఇప్పటికే 16-20 వేల పరుగులు చేసేశాడు, 70 సెంచరీలు బాదేశాడు. నేను ఆయనకి ఏ సలహా ఇవ్వగలను. నేనేమీ చెప్పను, చెప్పలేను కూడా. జనాలు సైలెంట్‌గా ఉండి, విరాట్‌ని ప్రశాంతంగా ఉంచితే చాలు. ఆయన ఆటను ఆయనను ఆడుకోనివ్వండి... చాలు.. అంటూ కామెంట్ చేశాడు జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా... 

Read more Photos on
click me!

Recommended Stories