ఈ జెర్సీతో ఆ రెండు టోర్నీలు ఆడకండి ప్లీజ్... బీసీసీఐకి ఫ్యాన్స్ విన్నపం...

Published : Aug 14, 2022, 03:02 PM IST

క్రికెట్‌లో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ముఖ్యంగా జెర్సీ రంగును బట్టి మ్యాచ్ ఫలితం మారిపోతుందని నమ్ముతారు క్రికెట్ ఫ్యాన్స్. 2011 వన్డే వరల్డ్ కప్‌లో విజయాన్ని ఇచ్చిన జెర్సీని మార్చి, కొత్త జెర్సీ వాడడం వల్లే 2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓడిందనేది చాలా మంది అభిప్రాయం...

PREV
16
ఈ జెర్సీతో ఆ రెండు టోర్నీలు ఆడకండి ప్లీజ్... బీసీసీఐకి ఫ్యాన్స్ విన్నపం...

Team India Jersey

2021 టీ20 వరల్డ్ కప్‌కి ముందు కూడా టీమిండియా జెర్సీ మారింది. బ్లూ కలర్‌పై భారత క్రికెట్ ఫ్యాన్స్ ఛీర్స్ నుంచి తీసిన ‘సౌండ్ వేవ్స్’ డిజైన్‌తో తీసిన కొత్త జెర్సీతో 2021 పొట్టి ప్రపంచకప్ ఆడింది టీమిండియా...

26

ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ ముగిసిన తర్వాత వార్మప్ మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు, తీరా టోర్నీ మొదలయ్యాక అసలు మ్యాచుల్లో తేలిపోయింది...

36

ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో మొట్టమొదటి సారి పాక్ చేతుల్లో పరాజయాన్ని ఎదుర్కొన్న భారత జట్టు, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ ఓడి గ్రూప్ స్టేజీకే పరిమితమైంది... దీంతో ఈ జెర్సీపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది...

46

ఆ తర్వాత కొన్నిరోజులకు జెర్సీని మరోసారి మార్చింది బీసీసీఐ. సౌండ్ వేవ్స్ లేకుండా అదే డార్క్ బ్లూ కలర్ జెర్సీని భారత జట్టు ప్రస్తుతం వాడుతోంది. ఆసియా కప్ 2022 టోర్నీలోనూ ఇదే జెర్సీతో బరిలో దిగనుంది భారత జట్టు...

56

రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకుంటూ జైత్ర యాత్ర కొనసాగిస్తోంది టీమిండియా. దీంతో ఈ జెర్సీ భారత జట్టుకి కాస్త బాగానే కలిసి వచ్చిందని చెప్పొచ్చు... 

66

అయితే ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ కొత్త జెర్సీని తీసుకువచ్చే ఆలోచనను విరమించుకోవాలని బీసీసీఐని కోరుతున్నారు అభిమానులు. జెర్సీ మారిస్తే మరోసారి భారత జట్టుకి పరాభవం తప్పదేమోనని భయపడుతున్నారు...

click me!

Recommended Stories