ఒక్కో పోస్టుకి రూ.9 కోట్లు తీసుకుంటున్న కోహ్లీ... ఇన్‌స్టాలో విరాట్ సంపాదన మామూలుగా లేదుగా...

Published : Sep 30, 2022, 06:30 PM IST

విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ ఒకడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 215 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన విరాట్ కోహ్లీ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంత ఆదాయం సంపాదిస్తున్నాడో తెలుసా...

PREV
15
ఒక్కో పోస్టుకి రూ.9 కోట్లు తీసుకుంటున్న కోహ్లీ... ఇన్‌స్టాలో విరాట్ సంపాదన మామూలుగా లేదుగా...

ట్విట్టర్‌లో 50.4 మిలియన్ల ఫాలోవర్లు కలిగిన విరాట్ కోహ్లీకి ఫేస్‌బుక్‌లో కూడా 50 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో ఫుట్‌బాల్ లెజెండ్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ తర్వాత అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్ విరాట్ కోహ్లీయే...

25

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకి 1,088,000 అమెరికన్ డాలర్లు ఆర్జిస్తున్నాడు విరాట్ కోహ్లీ. అంటే అక్షరాల 8 కోట్ల 90 లక్షల రూపాయలకు పైగా. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న టాప్ 20 సెలబ్రిటీల్లో విరాట్ కోహ్లీ ఒకడు...

35

విరాట్ కోహ్లీ ఇన్‌స్టా ఆదాయంలో టాప్ 20లో ఉన్న ఒకే ఒక్క భారతీయుడు కాగా బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి మకాం మార్చిన వెటరన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 27వ స్థానంలో ఉంది. ఇన్‌స్టా ఆదాయంలో టాప్ 100లో ఉన్న ఒకే ఒక్క క్రికెటర్ విరాట్ కోహ్లీ...

45
Virat Kohli

55
virat kohli

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రికెటర్‌గా టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, తన కొత్త హెయిర్ స్టైల్‌ కోసం రూ.85 వేలు ఖర్చు చేశాడు. ఫ్లిప్‌కార్ట్, పుమా, వ్రాంగ్, ఎంపీఎల్, మింత్రా, గ్రేట్ లెర్నింగ్, హిమాలయ, ఎంఆర్‌ఎఫ్... ఇలా దాదాపు 20కి పైగా వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు విరాట్ కోహ్లీ.. 

Read more Photos on
click me!

Recommended Stories