హోటల్‌లో పాస్‌పోర్ట్ మరిచిపోయిన రోహిత్ శర్మ... మరోసారి వెడ్డింగ్ రింగ్‌నే! ‘హిట్ మ్యాన్’ మతిమరుపు...

Published : Jul 17, 2022, 06:18 PM IST

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ... భారత క్రికెట్‌లో ఇద్దరు లెజెండ్స్. విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకోగా రోహిత్ శర్మ ఆ బాధ్యతలను అందుకున్నాడు. కెప్టెన్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్న హిట్ మ్యాన్‌కి మతిమరుపు చాలా ఎక్కువట. రోహిత్ మతిమరుపు గురించి గతంలో విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు...

PREV
17
హోటల్‌లో పాస్‌పోర్ట్ మరిచిపోయిన రోహిత్ శర్మ... మరోసారి వెడ్డింగ్ రింగ్‌నే! ‘హిట్ మ్యాన్’ మతిమరుపు...

‘2018లో ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాం. అయితే ముంబై నుంచి వచ్చేటప్పుడు పాస్‌పోర్ట్ మరిచిపోయానని తాపీగా చెప్పాడు రోహిత్ శర్మ. ఓ వైపు ఫ్లైట్ టైం అవుతోంది.. మరోవైపు రోహిత్ దగ్గర పాస్‌పోర్ట్ లేదు...

27

విషయం తెలుసుకున్న టీమ్ మేనేజ్‌మెంట్, ఆఖరి నిమిషాల్లో పాస్‌పోర్ట్‌ని ఢిల్లీకి తెప్పించగలిగింది. రోహిత్ చాలా సార్లు ఇలా చేశాడు. ఫోన్‌లో మాట్లాడుతూ, ఫోన్ చూస్తూ చాలా విషయాలను మరిచిపోతూ ఉంటాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్...

37

తరుచుగా మొబైల్స్‌ని హోటెల్‌లో మరిచిపోయే రోహిత్ శర్మ, ఓ సమయంలో వెడ్డింగ్ రింగ్‌ని కూడా మరిచిపోయే విమానం ఎక్కేశాడట. ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు రోహిత్ శర్మ...

47

‘నాకు పెళ్లైన కొత్తలో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాలనే కంగారులో లేని త్వరత్వరగా రెఢీ అయ్యి, టీమ్ బస్సు ఎక్కేశా. ఆ తర్వాత చూసుకుంటే వెడ్డింగ్ రింగ్ లేదు. రాత్రి పడుకునే ముందు పిల్లో పక్కన తీసి పెట్టా... దాన్ని అక్కడే మరిచిపోయా...

57
Rishabh Pant and Rohit Sharma

విరాట్ కోహ్లీకి విషయం చెప్పగానే షాక్ అయ్యాడు. వెడ్డింగ్ రింగ్ మరిచిపోవడం ఏంటని ఆశ్చర్యపోయాడు. అయితే ఎలాగోలా దాన్ని రప్పించగలిగాం. అందుకే చాలా సార్లు బయటికి వెళ్లేటప్పుడు నా తలుపు కొట్టమని, నన్ను కూడా వెంట తీసుకెళ్లమని చెబుతూ ఉంటా...’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ...

67

విరాట్ కోహ్లీ కూడా రోహిత్ మతిమరుపు గురించి ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు. ‘రోహిత్ శర్మకు ఉన్న మతిమరుపు నేనెవ్వరికీ చూడలేదు. అతను మొబైల్స్, వాలెట్స్, రింగ్స్... మరిచిపోతూ ఉంటాడు. వాటిని లెక్క కూడా చేయడు...

77
Virat and rohit

పోనివ్వు లే... ఇంకోటి కొనుక్కుందాం లే అంటాడు. చాలాసార్లు పాస్‌పోర్ట్ కూడా మరిచిపోయాడు. అందుకే రోహిత్ శర్మ రాగానే ముందు అన్ని వస్తువులు తెచ్చుకున్నావా? ఓసారి చూసుకో అని చెబుతా. అన్నీ తెచ్చుకున్నా... అని చెప్పాకే బస్సు కదులుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

Read more Photos on
click me!

Recommended Stories