బాలీవుడ్‌లో కొన్నాళ్లుగా బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ‘దంగల్’, ‘చక్ దే ఇండియా’, ‘బాగ్ మిల్కా బాగ్’, ‘ఎమ్మెస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ’ వంటి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ వచ్చిన బయోపిక్స్, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. దీంతో కొత్త కథలతో కష్టపడకుండా స్పోర్ట్స్ స్టార్ బయోపిక్‌లపైనే ఎక్కువ ఆసక్తి చూపించారు బాలీవుడ్ స్టార్స్. అయితే ఈ మధ్య విడుదలైన స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్స్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని రాబడుతున్నాయి...
శభాష్ మిథూ: భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన మూవీ ‘శభాష్ మిథూ’. టన్నుల కొద్దీ పరుగులు చేసి, కెప్టెన్‌గా విజయాలు అందించి... భారత్‌లో మహిళా క్రికెట్‌కి గుర్తింపు తెచ్చిన మిథాలీ రాజ్... తన కెరీర్‌లో ఎదుర్కొన్న అవమానాలను ఈ బయోపిక్‌లో చూపించే ప్రయత్నం చేశారు.
26
Image: Official film poster
అయితే లీడ్ రోల్‌లో నటించిన తాప్సీ, మిథాలీగా మెప్పించలేకపోయింది. దీనికి తోడు కథ, కథనాలు, స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్... ఏదీ ఇంప్రెస్ చేయలేకపోవడంతో మిథాలీ బయోపిక్... మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుని అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ మూటకట్టుకుంది...
36
83: భారత క్రికెట్ దశను మార్చిన 1983 వన్డే వరల్డ్ కప్ విజయంపై రూపొందించిన బయోపిక్ మూవీ ‘83’. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో నటించాడు. తొలి రోజు నుంచే విమర్శకుల ప్రశంసలను అందుకున్న ‘83’ మూవీ, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం మాత్రం కురిపించలేకపోయింది. రూ.270 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘83’, ఎంతో కష్టపడి రూ.193 కోట్లు రాబట్టింది. అయినా బయ్యర్లకు రూ.77 కోట్ల నష్టం తప్పలేదు...
46
సైనా: భారత్‌లో బ్యాడ్మింటన్ ఆటకు క్రేజ్ తెచ్చిన ప్లేయర్ సైనా నెహ్వాల్. తిరుగులేని విజయాలు అందుకున్న సైనా జీవిత కథ ఆధారంగా, బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా ప్రధాన పాత్రలో ‘సైనా’ మూవీ రూపొందింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా, విడుదలైంది కూడా ఎవ్వరికీ తెలియకుండానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. మొత్తంగా రూ.26 కోట్లతో రూపొందిన ‘సైనా’, బాక్సాఫీస్ దగ్గర రూ.1.51 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది...
56
స్టోర్స్ స్టార్ల బయోపిక్స్ వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుండడంతో ఇప్పుడు అందరి చూపు ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ వైపు మళ్లింది. భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి జీవితకథ ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ, నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అయితే తాప్సీ తన నటనతో మిథాలీ బయోపిక్‌ని నాశనం చేసినట్టు, అనుష్క శర్మ, జులన్ కష్టాన్ని నవ్వుల పాలు చేయదు కదా.. అని భయపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
66
అదీకాకుండా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ బయోపిక్స్‌తో పాటు భారత టెన్నిస్ స్టార్ పీవీ సింధు బయోపిక్ రూపొందించే ఆలోచనల్లో ఉన్న డైరెక్టర్లు, నిర్మాతలు... ఈ బయోపిక్స్ రిజల్ట్స్ చూసి ఆలోచనలో పడ్డారట...