2014 తర్వాత తొలిసారి రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేశాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. అదనపు బౌలర్‌గా నటరాజన్‌ను చేర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు కోహ్లీ...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోడి తొలి వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, భారత జట్టు భారీ స్కోరు చేయడానికి బాటలు వేసింది. కోహ్లీ సింగిల్స్ తీస్తూ స్ట్రైయికింగ్ ఇస్తుంటే, రోహిత శర్మ బౌండరీలతో విరుచుకుపడ్డాడు...

మొదటి నాలుగు మ్యాచుల్లో కలిపి మొదటి వికెట్‌కి కేవలం 30 పరుగులే జోడించగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 94 పరుగులు జోడించారు.. దీంతో తాను ఓపెనర్‌గా కొనసాగాలనుకుంటున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ...

‘ఐపీఎల్‌లోనూ ఓపెనింగ్ చేయాలని నిర్ణయించుకున్నా. బ్యాటింగ్ ఆర్డర్‌లో చాలా స్థానాల్లో ఆడిన అనుభవం నాకు ఉంది. మిడిల్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. నేను, రోహిత్ కలిసి ఓపెనింగ్ చేస్తే... ఇద్దరిలో ఒకరు నిలబడేందుకు అవకాశం ఉంటుంది...

రోహిత్ లేదా నేను నిలబడి ఇన్నింగ్స్ నిర్మిస్తే, మిడిల్ ఆర్డర్‌కి పరుగులు చేయడం ఈజీ అయిపోతుంది. కాబట్టి టీ20 వరల్డ్‌కప్‌కి పటిష్టమైన ఓపెనింగ్ ఉండాలని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ...

విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తే, వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్ సెటిల్ అయ్యే అవకాశం ఉంది. దీంతో తుదిజట్టులో స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్లేయర్లకు విరాట్ నిర్ణయం షాక్‌కి గురి చేసింది...

రెండో టీ20లో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్, మంచి ఇన్నింగ్స్‌లో అదరగొట్టాడు. గత ఏడాది పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత టీ20 ప్లేయర్ కెఎల్ రాహుల్ కూడా ఓపెనర్ స్థానం కోసం పోటీపడుతున్నాడు.

వీళ్లిద్దరే కాకుండా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో విఫలం కావడంతో మళ్లీ అతనికి అవకాశం రాలేదు. ఇప్పుడు కోహ్లీ నిర్ణయంతో వీరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తే, వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్ లేదా ఇషాన్ కిషన్ ఖచ్ఛితంగా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా ఎలాగూ సెటిల్ అయిపోయారు..

కాబట్టి తుదిజట్టులో మరో బ్యాట్స్‌మెన్‌ను చేర్చడం చాలా కష్టమైపోతుంది. కెఎల్ రాహుల్ మిడిల్ ఓవర్లలోనూ ఆడగలడు కానీ ఐదుగురు బౌలర్లతోనే బరిలో దిగిన టీమిండియాకు ఆశించిన రిజల్ట్ రావడం లేదు..

కాబట్టి కెఎల్ రాహుల్ కంటే బౌలింగ్, అవసరమైనప్పుడు హిట్టింగ్ కూడా చేయగలిగిన ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్‌లవైపు కోహ్లీ మొగ్గుచూపే అవకాశం ఉంది...

జడ్డూ కోలుకుని, బుమ్రా కమ్‌బ్యాక్ ఇస్తే ఇక టీ20 వరల్డ్‌కప్‌లో ఆడబోయే తుదిజట్టు డిసైడ్ అయిపోయినట్టే... ఆ 11 మందిలో ఎవరైనా గాయపడితేనే, అందుబాటులో లేకపోతేనే కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్ వంటివాళ్లకి అవకాశం దొరికేందుకు వీలు అవుతుంది...