రో‘హిట్ మ్యాన్’ సునామీ... ‘కింగ్’ విరాట్ కోహ్లీ ఉప్పెన... ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్...

Published : Mar 20, 2021, 09:19 PM IST

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ... రెండు భిన్న మనస్థత్వాలు... ఒకరు నీరైతే, మరొకరు నిప్పు! అయితే క్రీజులో దిగితే విరాట్ కోహ్లీ కూల్‌గా నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మిస్తే, రోహిత్ శర్మ బౌండరీల మోతతో బౌలర్లకు చుక్కలు చూపిస్తారు. చాలారోజుల తర్వాత ఈ ఇద్దరూ కలిపి టీమిండియా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి ఇన్నింగ్స్‌లను రుచి చూపించారు...

PREV
110
రో‘హిట్ మ్యాన్’ సునామీ... ‘కింగ్’ విరాట్ కోహ్లీ ఉప్పెన... ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్...

నటరాజన్‌కి అవకాశం ఇచ్చిన విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్‌ను తప్పించి ఆ స్థానంలో తానే ఓపెనర్‌గా రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం తర్వాత టీమిండియా ఫ్యాన్స్ కాస్త భయపడ్డారు...

210

కానీ మొదటి రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన రోహిత్ శర్మ... ఆ తర్వాత తనలోని ‘హిట్ మ్యాన్’ని నిద్రలేపాడు. బౌలర్ ఎవరు, ఎలాంటి బంతులు వేస్తున్నాడనేది సంబంధం లేకుండా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు రోహిత్... 2014 తర్వాత తొలిసారి ఓపెనింగ్ చేశారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.

310

రోహిత్ శర్మ పరుగులు సునామీని చూసిన విరాట్ కోహ్లీ అతనికి స్ట్రైయికింగ్ ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తూ సింగిల్స్ తీశాడు. తొలి వికెట్‌కి వచ్చిన 94 పరుగుల భాగస్వామ్యంలో విరాట్ కోహ్లీ చేసింది 29 పరుగులే. 

410

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య గొడవలున్నాయి? వారిద్దిరికీ ఒకరంటే ఒకరికి అసలు పడదు అనే వార్తలకు చెక్ పెడుతూ సాగిందీ భాగస్వామ్యం. రోహిత్ సిక్సర్ కొట్టిన ప్రతీసారీ తానే కొట్టినట్టు ఎంజాయ్ చేశాడు కోహ్లీ...

510

34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుటైన తర్వాత తనలోని క్లాస్ బ్యాటింగ్‌ని బయటికి తీశాడు విరాట్ కోహ్లీ. సూర్యకుమార్ యాదవ్‌కి సపోర్ట్ చేస్తూనే బౌండరీలు బాదాడు...

610

52 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... అంతర్జాతీయ కెరీర్‌లో 13 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ 277 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయి అందుకోగా, విరాట్ కోహ్లీ కేవలం 260 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు.

710

టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ... ఐదు మ్యాచుల్లో కలిసి 231 పరుగులు చేశాడు. ఇందులో ఓ డకౌట్, ఓ మ్యాచ్‌లో 1 పరుగుకే అవుట్ అయ్యాడు కోహ్లీ. 

810

టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీయే. ఇంతకుముందు కెఎల్ రాహుల్ చేసిన 224 పరుగులే అత్యధికం.

910

టీ20ల్లో టాప్ 4 బ్యాట్స్‌మెన్‌ రెండు, అంతకంటే సిక్సర్లు బాదడం ఇదే తొలిసారి. రోహిత్ శర్మ 5, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా రెండేసి సిక్సర్లు బాదారు. 

1010

ఐదో టీ20 మ్యాచ్‌లో చేసిన 224 పరుగులే ఇంగ్లాండ్‌పై టీమిండియాకి అత్యధిక స్కోరు. అత్యధికసార్లు 200+ స్కోరు చేసిన జట్టుగా టాప్‌లో నిలిచింది టీమిండియా. టీమిండియా 18 సార్లు 200+ స్కోరు చేయగా, ఆస్ట్రేలియా 14 సార్లు చేసి రెండో స్థానంలో ఉంది.

click me!

Recommended Stories