విరాట్ కోహ్లీ పెద్ద మనసు... 10 వేల మంది చిన్నారుల ఆకలి తీర్చేందుకు సాయంగా...

First Published Nov 18, 2020, 5:01 PM IST

భారత సారథి, ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రికెటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ.. ‘వైజ్ (vize)’ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సానిటేజర్ ప్రొడక్ట్‌ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా 10 వేల మంది చిన్నారులకు సాయం అందించబోతున్నాడు విరాట్ కోహ్లీ.

‘వైజ్’ సానిటేషన్ ప్రొడక్టుతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఆ సంస్థ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారించబోతున్నాడు విరాట్ కోహ్లీ...
undefined
అయితే ఈ ఒప్పందం ద్వారా తనకు వచ్చే మొత్తాన్ని మహారాష్ట్రలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు విరాళంగా ఇస్తాడు కోహ్లీ...
undefined
తనకు వచ్చిన మొత్తాన్ని ‘రా ఫౌండేషన్’కు ఇవ్వబోతున్నాడు విరాట్ కోహ్లీ... ఈ సంస్థ మహారాష్ట్ర బీద, నిరుపేద, అభాగ్య చిన్నారుల ఆలనా పాలనా చూస్తోంది...
undefined
‘నేను ఈ గొప్ప పనిలో భాగం అవుతున్నందుకు గర్వపడుతున్నా. దేశంలో ఉన్న పౌష్టికాహార లోపంతో యుద్ధం చేసే లక్ష్యంతో వైజ్ ద్వారా నాకొచ్చే ఆదాయాన్ని విరాళంగా ప్రకటిస్తున్నా... మాకు మీ ప్రేమ, ఆదరాభిమానాలే పెద్ద ఆస్తి’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.
undefined
ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ... సిరీస్ ప్రారంభానికి ముందే మరో ఘనత కూడా సాధించాడు.
undefined
ఐపీఎల్ 2020 సీజన్‌లో అత్యధిక మంది ట్వీట్ చేసిన పేరుగా విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ధోనీ, రోహిత్ శర్మ, క్రిస్ గేల్, కెఎల్ రాహుల్ వంటి వాళ్లను పక్కననెట్టి టాప్ ప్లేస్‌కి చేరాడు విరాట్ కోహ్లీ...
undefined
అంతేకాకుండా విరాట్ కోహ్లీ సారథ్యంలోనిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ధోనీ కెప్టెన్సీలోనిచెన్నై సూపర్ కింగ్స్ జట్లు మోస్ట్ ట్వీటెడ్ జట్లుగా నిలిచాయి...
undefined
హిమాలయ, విక్స్ యాక్షన్ 500, వోలిని, ఎమ్‌పీఎల్, రాంగ్, మయన్వార్ వంటి ఎన్నో బ్రాండ్లకి అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్న విరాట్ కోహ్లీ... ఏటా కొన్ని వందల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడు.
undefined
click me!