ఆగస్టులో ఇంగ్లాండ్ టూర్‌కి టీమిండియా... 16 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టబోతున్న...

First Published Nov 18, 2020, 4:01 PM IST

వచ్చే ఏడాది టీమిండియా ఆడబోయే షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత రోజే ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్... వచ్చే ఏడాది ఆడబోయే సిరీస్‌లకు సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత పర్యటనకు ఇంగ్లాండ్ రానుండగా, ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది.

ఐపీఎల్ ముగిసిన శ్రీలంకతో టీ20 సిరీస్, ఆసియా కప్, జింబాబ్వే టూర్ ముగించుకున్న తర్వాత ఆగస్టు నెలలో ఇంగ్లాండ్ టూర్‌కి బయలు దేరి వెళ్లనుంది భారత జట్టు. అక్కడ ఐదు టెస్టు మ్యాచులు ఆడబోతోంది...
undefined
ఆగస్టు 4న ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్ జట్టుతో మొదటి టెస్టు ఆడబోతోంది భారత జట్టు...
undefined
ఆగస్టు 12న ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ ఆడుతుంది టీమిండియా...
undefined
ఆగస్టు 25న హెడ్డింగ్లేలో మూడో టెస్టు ఆడుతుంది భారత క్రికెట్ జట్టు...
undefined
సెప్టెంబర్ 2న ఓవల్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతుంది..
undefined
ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో సెప్టెంబర్ 10న భారత్, ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్టు జరుగుతుంది. సెప్టెంబర్ 14న ముగిసే ఈ టెస్టుతో టూర్‌ను ముగిస్తుంది భారత జట్టు.
undefined
స్వదేశంలో ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టు మ్యాచులు ఆడబోతున్న భారత జట్టు, ఇంగ్లాండ్‌తో మరో ఐదు టెస్టు మ్యాచులు ఆడనుంది. అంటే ఇంగ్లాండ్‌తో ఒకే ఏడాదిలో తొమ్మిది టెస్టులు ఆడనుంది టీమిండియా.
undefined
2005లో పాక్‌లో పర్యటించిన ఇంగ్లాండ్, ఆ తర్వాత మళ్లీ అక్కడ అడుగుపెట్టలేదు. అయితే 16 ఏళ్ల తర్వాత తిరిగి పాకిస్థాన్‌లో అడుగుపెట్టబోతోంది ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్.
undefined
2021 అక్టోబర్ నెలలో టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్‌కి వెళ్లనుంది ఇంగ్లాండ్ జట్టు. ఇండియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్థాన్‌తో టీ20 మ్యాచులు ఆడనుంది ఇంగ్లాండ్.
undefined
click me!