విరాట్ కోహ్లీ చాలా మారిపోయాడు సార్... రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి కోపం వచ్చినా....

First Published Aug 30, 2021, 12:29 PM IST

మోస్ట్ అగ్రెసివ్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, క్రీజులో కోపాన్ని, దూకుడు చూపించినా... ఇంటర్వ్యూల్లో మాత్రం అది కనిపించదు... ఒకవేళ కోపం వస్తే మాత్రం దాన్ని ప్రదర్శించడానికి ఏ మాత్రం మొహమాటపడడు... అయితే తాజా ఇంటర్వ్యూలో మాత్రం అతని ప్రవర్తనలో మార్పు కనిపించింది...

టీమిండియాలో ఒక్కో క్రికెటర్, ఒక్కోలా రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. రోహిత్ శర్మ ఇంటర్వ్యూలు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. రిపోర్టర్లు అడిగే తిక్క తిక్క ప్రశ్నలకు వెటకారంగా సమాధానాలు ఇస్తూ, వాళ్ల నోళ్లు మూయిస్తాడు ‘హిట్ మ్యాన్’...

మహేంద్ర సింగ్ ధోనీ చాలా కూల్‌గా ప్రవర్తిస్తూనే, తనపైన వచ్చే ట్రోల్స్‌కి కూడా కూల్ రియాక్షన్ ఇచ్చేవాడు... రవిచంద్రన్ అశ్విన్ మాత్రం చాలా ముక్కుసూటి. ఎవరేమీ అనుకున్నా, సూటిగా సుత్తిలేకుండా చెంప చెల్లుమనేలా ఆన్సర్ ఇస్తాడు అశ్విన్...

క్రీజులో అగ్రెసివ్‌గా నడుచుకునే విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ ప్రెస్ కాన్ఫిడెన్సుల్లో మాత్రం అలా కనిపించదు. అయితే తాజాగా ఇంగ్లాండ్‌ టూర్‌లో మూడో టెస్టు ఓటమి తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకి, కోహ్లీకి తిక్కరేగినట్టే కనిపించింది...

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేసిన ఇంగ్లాండ్ స్కోరును దాటలేక ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది..

విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ టూర్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకే విధంగా అవుట్ అయ్యాడు. ఐదో స్టంప్‌ లైన్‌లో వెళ్తున్న బంతులను వెటాడబోయి, కీపర్‌కి, స్లిప్‌ ఫీల్డర్లకు క్యాచ్‌లు ఇచ్చి వెనుదిరిగాడు... 

దీని గురించి అడగాలని భావించిన ఓ రిపోర్టర్... ‘నిజాయితీగా చెప్పాలంటే, నాకు ఎలా అడగాలో తెలియడం లేదు. మీ లెంగ్త్‌లో లేని బంతులను బ్యాక్‌ఫుట్‌తో ఆడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు?’ అంటూ ప్రశ్నించాడు...

ఇంగ్లాండ్‌లో ఒకే ఒక్కసారి హాఫ్ సెంచరీ స్కోరు దాటిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌ను విమర్శిస్తూ వచ్చిన ప్రశ్న ఇది. మీకు బ్యాక్‌ఫుట్‌తో ఆడడం లేదని చెబుతున్నట్టుగా పరోక్షంగా ప్రశ్నించాడు సదరు రిపోర్టర్...

ఆ ప్రశ్న వినగానే విరాట్ కోహ్లీకి కోపం వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమైంది. అయితే తన కోపాన్ని నిగ్రహించుకున్న విరాట్ కోహ్లీ, ‘ఓకే... థ్యాంక్స్’ అంటూ సమాధానం ఇచ్చి ముగించాడు...

కోపం వస్తే, మనవాళ్లు, ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు అనే తేడా లేకుండా తిట్టేసే విరాట్ కోహ్లీ... తన ఆగ్రహాన్ని నిగ్రహించుకుని, నోరుని కంట్రోల్‌లో పెట్టుకోవడం చూసి అతని అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు... 

click me!