Virat Kohli: ఎట్టకేలకు సచిన్ ను కాంటాక్ట్ అయిన కోహ్లి.. మాస్టర్ బ్లాస్టర్ ఏం చెప్పాడంటే..

Published : Feb 23, 2022, 04:36 PM IST

Virat Kohli Contacts Sachin Tendulkar: రెండేండ్లుగా  సెంచరీ లేక ఇబ్బందులు పడుతున్న  టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లి ఎట్టకేలకు ఫ్యాన్స్ మొర ఆలకించాడు.. 

PREV
19
Virat Kohli: ఎట్టకేలకు సచిన్ ను కాంటాక్ట్ అయిన కోహ్లి.. మాస్టర్ బ్లాస్టర్ ఏం చెప్పాడంటే..

టీమిండియా  మాజీ సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి  గత కొద్దికాలంగా అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. అదీగాక  అతడు సెంచరీ చేయక  సుమారు రెండేండ్లు దాటింది.

29

గతేడాది ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ నుంచే కోహ్లి అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్.. అతడు సెంచరీ చేస్తాడని ప్రతి  మ్యాచులో చూడటం, విరాట్ నిరాశపరచడం  సాధారణమైపోయింది.

39

ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ తో, దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు,  మూడు వన్డేలు ఆడాడు కోహ్లి. ఇక ఇటీవలే  విండీస్ తో ముగిసిన  వన్డే సిరీస్ లో కూడా మూడు వన్డేలు ఆడిన విరాట్.. అభిమానులను  తీవ్ర నిరాశకు గురి చేస్తూ  తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. 

49

ఈ నేపథ్యంలో  కోహ్లి ఒకసారి సచిన్ ను కలవాలని, మాస్టర్ బ్లాస్టర్ సలహాలు,  సూచనలు తీసుకోవాలని అతడి అభిమానులతో పాటు  భారత క్రికెట్   దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా కామెంట్ చేశాడు. 

59

దీంతో ఎట్టకేలకు  కోహ్లి  సచిన్ ను కాంటాక్ట్ అయ్యాడు.  ఈ విషయాన్ని సచినే స్వయంగా వెల్లడించాడు. ఇదే విషయమై సచిన్ స్పందిస్తూ.. 2014 లో  కోహ్లిని కలిసి చర్చించిన పలు విషయాలను గుర్తు చేసుకున్నాడు. 

69

‘అప్పుడు (2014) మేం కలుసుకున్న సమయంలో చాలా మాట్లాడుకున్నాం. ఆ సమయంలో కోహ్లి ఫామ్ కోల్పోయి  (ఇంగ్లాండ్ తో సిరీస్ లో)  తంటాలు పడుతున్నాడు. ఆటగాళ్లకు తమ కెరీర్ లో ఇలాంటి   దశలు రావడం సహజం.  ఆ క్రమంలో నన్ను కలిసిన కోహ్లికి నాకు తెలిసిన, నేను నేర్చుకున్న  విషయాలను అతడికి చెప్పాను. యువ ఆటగాళ్లకు నాకు తెలిసినవి పంచుకోవడంలో నేనెప్పుడూ ముందు వరుసలో ఉంటా.

79

విరాట్ నాకు మంచి స్నేహితుడు. గత దశాబ్దంలో అతడి ఆటను చూడటం  కన్నులవిందుగా ఉంటుంది. అతడిని చూస్తే  నన్ను నేను యువకుడిగా ఉన్నప్పుడు చూసుకున్నట్టే ఉంటుంది.

89

ఈ మధ్యే విరాట్ నాకు కాంటాక్ట్ అయ్యాడు. కలిసి మాట్లాడాలని, కొంత సమయం గడపాలని నాతో చెప్పాడు. దానికి నేను కూడా ఓకే అన్నాను..’ అని సచిన్ వివరించాడు. 

99

వెస్టిండీస్ తో వన్డేలలో విఫలమైన  తర్వాత కోహ్లి కామెంట్రీ బాక్స్ లో వ్యాఖ్యానిస్తూ.. ‘కోహ్లిని నేను సచిన్ టెండూల్కర్ ను కలవమని సూచిస్తాను.. అతడు కొంచెం ఓపికగా ఉండాలి. అతడి టెక్నిక్ లో లోపమేమీ లేదు. కానీ కొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతుంది..’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories