నెం.1 బ్యాట్స్‌మెన్‌గా 1500 రోజులు... భారత సారథి విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు...

First Published Feb 4, 2021, 11:44 AM IST

భారత సారథి విరాట్ కోహ్లీ వన్డే నెం.1 బ్యాట్స్‌మెన్‌గా 1500 రోజులను పూర్తిచేసుకున్నాడు. 2013, నవంబర్ 3న తొలిసారిగా వన్డేల్లో నెం.1 ర్యాంకును కైవసం చేసుకున్న విరాట్ కోహ్లీ... 2017 నుంచి వరుసగా నాలుగేళ్లుగా టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. 

2017 నుంచి నాలుగేళ్లుగా ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ...
undefined
నెం.1 బ్యాట్స్‌మెన్‌గా అవతరించిన తర్వాత 4037 పరుగులు, 16 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్, గత ఏడాది సెంచరీ లేకుండానే ముగించాడు..
undefined
డిసెంబర్ 24, 2016న ఐసీసీ నెం.1 వన్డే బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ... అప్పటినుంచి టాప్ ర్యాంకులోనే కొనసాగుతున్నాడు.
undefined
టీ20ల్లో 1015 రోజుల పాటు నెం.1 బ్యాట్స్‌మెన్‌గా కొనసాగిన విరాట్ కోహ్లీ... వన్డేల్లో1500+ రోజులుగా టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు...
undefined
వన్డే, టీ20ల్లో 1000 రోజులకు పైగా టాప్ ర్యాంకులో కొనసాగిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...
undefined
అత్యధిక రోజులు వన్డే నెం.1 బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...
undefined
ఇంతకుముందు బ్రియాన్ లారా 1993 నుంచి 1998దాకా 2104 రోజుల పాటు నెం.1 బ్యాట్స్‌మెన్‌గా కొనసాగాడు. ఆ తర్వాత రికార్డు విరాట్ కోహ్లీదే..
undefined
ఏబీ డివిల్లియర్స్ 1480, మైఖేల్ బేగన్ 1392, హషీమ్ ఆమ్లా 937, మహేంద్ర సింగ్ ధోనీ 706 రోజుల పాటు నెం.1 వన్డే బ్యాట్స్‌మెన్‌గా కొనసాగారు...
undefined
ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ, ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో రాణిస్తే టాప్ ర్యాంకు అధిరోహించే అవకాశం ఉంటుంది...
undefined
టీ20 ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ... టీ20, టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఉన్న ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు...
undefined
వన్డే మ్యాచుల్లో విరాట్ కోహ్లీ సెంచరీ బాది, ఏడాదిన్నర దాటిపోయింది. 2019 ఆగస్టులో వన్డేల్లో చివరి వన్డే బాదిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత విండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీసుల్లో సెంచరీ చేయలేకపోయాడు.
undefined
ప్రస్తుతం వన్డేల్లో 870 పాయింట్లతో టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీకి, రెండో స్థానంలో కొనసాగుతున్నవన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ప్రమాదం పొంచిఉంది.
undefined
click me!