‘థ్యాంక్యూ ఇండియా...’ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్...

First Published Feb 4, 2021, 9:26 AM IST

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్... భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా ఎంతో అద్భుతమైన దేశమంటూ కొనియాడారు. పీటర్సన్ ట్వీట్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడం విశేషం... దక్షిణాఫ్రికాకి టీమిండియా అందించిన సాయమే దీనికి కారణం..

ఇంగ్లాండ్‌కి కెప్టెన్‌గా వ్యవహారించినా... కెవిన్ పీటర్సన్ సొంత దేశం దక్షిణాఫ్రికా. సౌతాఫ్రికాలో జాతివివక్షపై ఆరోపణలు చేసిన పీటర్సన్ ఇంగ్లాండ్‌ క్రికెట్ జట్టుకు ఆడాడు.. పీటర్సన్ తండ్రి దక్షిణాఫ్రికా వ్యక్తి కాగా, తల్లి ఇంగ్లాండ్‌కి చెందిన మహిళ.
undefined
దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో భారత కేంద్ర ప్రభుత్వం.. జోహెనస్‌బర్డ్‌కి విమానంలో మందులను తరలించింది...
undefined
సౌతాఫ్రికాకి మందులు తరలించిన ఫోటోను ట్వీట్ చేశారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్... దీనిపై స్పందించాడు కెవిన్ పీటర్సన్...
undefined
‘ఇండియా ఎంతో దయగల దేశం, వారి ఉదారత రోజురోజుకీ పెరుగుతూనే ఉంది... భారత్ ఎంతో అద్భుతమైన దేశం... మోస్ట్ లవబుల్ కంట్రీ’ అంటూ ట్వీట్ చేశాడు పీటర్సన్...
undefined
పీటర్సన్ ట్వీట్‌కి భారత ప్రధాని మోదీ స్పందించారు... ‘ప్రపంచమంతా మా కుటుంబంగానే భావిస్తాం... ఇండియాపై మీకున్న ప్రేమకు ధన్యవాదాలు... కరోనాపై పోరాటం చేసేందుకు మా వంతు సాయం అందిస్తాం’ అంటూ ట్వీట్ చేశారు మోదీ...
undefined
దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల వచ్చే నెలలో జరగాల్సిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ వాయిదా పడిన విషయం తెలిసిందే...
undefined
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ వాయిదా పడడం వల్ల న్యూజిలాండ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి నేరుగా అర్హత సాధించింది. ఇంగ్లాండ్, ఇండియా టెస్టు సిరీస్ ఫలితం ఫైనల్ చేరే మరో జట్టును నిర్ణయించనుంది...
undefined
దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా వాయిదా వేయడాన్ని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తప్పుబట్టారు... దక్షిణాఫ్రికా స్థానంలో ఇండియా ఉంటే ఇలా చేసేవారా? అంటూ ప్రశ్నించాడు...
undefined
‘క్రికెట్‌కి ఇది ఏ మాత్రం మంచిది కాదు. శ్రీలంక పర్యటనలో ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడినా, ఇంగ్లాండ్ సిరీస్ విజయవంతంగా ముగిసింది.
undefined
దక్షిణాఫ్రికా స్థానంలో టీమిండియా ఉండి ఉంటే... ఆస్ట్రేలియా సిరీస్ రద్దు చేసుకునే ధైర్యం చేసి ఉండేదా... ’ అంటూ ప్రశ్నించాడు కెవిన్ పీటర్సన్...
undefined
మార్చిలో జరగాల్సిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌ను కరోనా కారణంగా చూపుతూ వాయిదా వేయడాన్ని సఫారీ క్రికెట్ టీం తప్పుపట్టింది....
undefined
‘ఆస్ట్రేలియా చివరి నిమిషంలో టెస్టు సిరీస్‌ను వాయిదా వేయడం ఏం బాగోలేదు... ఇలా చేయడం వల్ల సిరీస్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకి ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిస్తుంది’ అంటూ వ్యాఖ్యానించాడు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్, మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్...
undefined
click me!