విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య గొడవలున్నాయి, క్లియర్‌గా తెలుస్తోంది... నయన్ మోంగియా కామెంట్స్...

Published : Dec 18, 2021, 10:03 AM IST

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై రేగిన చిచ్చు, ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్పిరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు, ఈ వివాదాన్ని మరింత రేపాయి...

PREV
111
విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య గొడవలున్నాయి, క్లియర్‌గా తెలుస్తోంది... నయన్ మోంగియా కామెంట్స్...

విరాట్ కోహ్లీని మద్ధతుగా అతని అభిమానులు, బీసీసీఐకి, భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మద్ధతుగా దాదా ఫ్యాన్స్.. సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం చేస్తున్నారు...

211

తాజాగా భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, మాజీ కోచ్ నయన్ మోంగియా ఈ వివాదం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు...

311

‘విరాట్ కోహ్లీ స్పష్టంగా తన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో తనకీ, బీసీసీఐకి మధ్య సత్సంబంధాలు లేవని తెలియచేశాడు. తనకి జరిగిన ప్రతీ విషయాన్ని క్లియర్‌గా అభిమానులకు తెలియచేశాడు...

411

విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య గొడవలున్నాయని క్లియర్‌గా తెలుస్తోంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ, విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంలో తప్పు లేదు...

511

అయితే ఆ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పించే ముందు అతనితో సంప్రదింపులు జరిపి, చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాల్సింది...’ అంటూ కామెంట్ చేశాడు నయన్ మోంగియా... 

611

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టుగా స్వయంగా ప్రకటించాడు విరాట్ కోహ్లీ. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది...

711

అయితే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ, వన్డే కెప్టెన్‌గానూ రోహిత్ శర్మను ఎంపిక చేసినట్టు ప్రకటించింది...

811

తనకు ఈ విషయాన్ని గంటన్నర ముందే చెప్పారని, టెస్టు టీమ్ సెలక్షన్ గురించి చర్చించిన చీఫ్ సెలక్షన్ అధికారి, మీటింగ్ ముగించేముందు ఇకపై మీరు వన్డే కెప్టెన్‌గా ఉండరని చెప్పాడని కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

911

ఈ కామెంట్లపై స్పందించడానికి ఇష్టపడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ‘అన్నీ బీసీసీఐకి వదిలేయండి, మేమే చూసుకుంటాం...’ అంటూ వ్యాఖ్యానించాడు...

1011

గంగూలీ కామెంట్లను బట్టి చూస్తే, విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ పెద్దలు సీరియస్‌గా ఉన్నారని, సౌతాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత అతనిపై చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతున్నారని వార్తలు వచ్చాయి...

1111

ఈ వార్తల కారణంగా సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ రెండుగా చీలిపోయారు. సౌరవ్ గంగూలీని సపోర్ట్ చేస్తూ 'Nation Stands With Dada’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను దాదా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తుంటే, విరాట్ ఫ్యాన్స్... 'World Stands with Virat Kohli’ ట్యాగ్‌ను మరింత తీవ్రంగా ట్రెండ్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories