ఛతేశ్వర్ పూజారా ఒకే! మరి విరాట్ కోహ్లీ ఏం పొడిచాడని సెలక్ట్ చేశారు... సెలక్టర్లపై ఆకాశ్ చోప్రా ఫైర్

Published : Jun 25, 2023, 01:50 PM IST

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో కుర్రాళ్లు కావాలని డిమాండ్ చేశారు సీనియర్లు. వాళ్ల కోరికను మన్నించి, ఛతేశ్వర్ పూజారాకి రెస్ట్ ఇచ్చి యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాల్‌ను విండీస్ టూర్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు...

PREV
18
ఛతేశ్వర్ పూజారా ఒకే! మరి విరాట్ కోహ్లీ ఏం పొడిచాడని సెలక్ట్ చేశారు... సెలక్టర్లపై ఆకాశ్ చోప్రా ఫైర్

అప్పుడు కుర్రాళ్లు కావాలన్న వాళ్లే, ఇప్పుడు ఛతేశ్వర్ పూజారాని తప్పించడంపై సీరియస్ అవుతున్నారు. ఛతేశ్వర్ పూజారాని ఒక్కడినే తప్పించడం కరెక్ట్ కాదని వాపోతున్నారు. విరాట్ కోహ్లీపై వేటు వేయనందుకు తెగ ఫీలైపోతున్నారు...
 

28
kohli pujara

సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు లేకపోవడం వల్లే ఛతేశ్వర్ పూజారాని టెస్టు టీమ్ నుంచి తప్పించారని పరోక్షంగా విరాట్ కోహ్లీ ఎంపికను తప్పుబట్టాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

38

తాజాగా భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా సెలక్టర్లను తప్పుబట్టాడు. ‘ఛతేశ్వర్ పూజారాకి టెస్టు టీమ్‌లో చోటు దక్కలేదు. ఇది సరైన నిర్ణయమేనా? ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్పాలనుకోవడం లేదు..
 

48
Rohit and Pujara

అయితే త మూడేళ్లలో టెస్టుల్లో భారత బ్యాటర్ల గణాంకాలు మాత్రం చెబుతాను. రోహిత్ శర్మ, గత 18 టెస్టుల్లో 43 యావరేజీతో పరుగులు చేశాడు. శుబ్‌మన్ గిల్ 15 మ్యాచుల్లో 34 యావరేజ్‌తో పరుగులు చేశాడు...

58

కెఎల్ రాహుల్ టెస్టు యావరేజ్ 30 ఉంటే, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ ఇద్దరి టెస్టు యావరేజ్ సమానంగా ఉంది. గత మూడేళ్లలో విరాట్, పూజారా ఇద్దరూ కూడా 29.69 సగటుతో టెస్టుల్లో పరుగులు చేశారు. రహానే సగటు 26.5 మాత్రమే...
 

68

గణాంకాల ప్రకారం చూసుకుంటే పూజారాని బలి చేయాల్సిన అవసరం ఏంటి? అజింకా రహానే కమ్‌బ్యాక్ తర్వాత ఒకే టెస్టు ఆడాడు. పూజారా కమ్‌బ్యాక్ తర్వాత బంగ్లాదేశ్ టూర్‌లో సెంచరీ కూడా చేశాడు. కౌంటీ క్రికెట్‌లో అతను అదరగొట్టాడు..

78

డబ్ల్యూటీసీ ఫైనల్ పర్ఫామెన్స్ మాత్రమే చూసుకుంటే రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అజింకా రహానే తప్ప ఎవ్వరికీ విండీస్ టూర్‌లో చోటు దక్కకూడదు.. 

88
Cheteshwar Pujara

నాకు తెలిసి డబ్ల్యూటీసీ 2025 సీజన్ మొదలైపోయింది కాబట్టి ఛతేశ్వర్ పూజారాని పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఫైనల్ నాటికి కుర్రాళ్లకు తయారుచేయాలని టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లు ఫిక్స్ అయినట్టు ఉన్నారు...’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా...

Read more Photos on
click me!

Recommended Stories