వన్డే వరల్డ్ కప్ తర్వాత అతనే టీమిండియా కెప్టెన్! టెస్టుల్లో మాత్రం.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి

Published : Jun 25, 2023, 01:16 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్ అవుతాడనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా సరైన ఫామ్‌ కొనసాగించలేకపోతున్న రోహిత్ శర్మ, 2007 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్నాడు.. 

PREV
15
వన్డే వరల్డ్ కప్ తర్వాత అతనే టీమిండియా కెప్టెన్! టెస్టుల్లో మాత్రం.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి
Rohit Sharma

రోహిత్ శర్మ రిటైర్ అయితే టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ ఎవరు? గత ఏడాది రోహిత్ శర్మ ఆడని మ్యాచుల్లో కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరిలో ఐపీఎల్ 2022 టోర్నీ గెలిచిన హార్ధిక్ పాండ్యా, టీమిండియాకి టీ20 కెప్టెన్‌గా ఉన్నాడు...
 

25

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్... టీ20 ఫార్మాట్‌కి దూరంగా ఉన్నారు. టీ20లకు సారథిగా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా, వన్డే కెప్టెన్‌గానూ బాధ్యతలు తీసుకుంటాడని అంటున్నాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..

35

‘రోహిత్ శర్మ తర్వాత హార్ధిక్ పాండ్యానే వైట్ బాల్ కెప్టెన్. అతను ఫిట్‌గా ఉంటే మరో 10 ఏళ్ల వరకూ టీమ్‌ని నడిపించగలడు. టెస్టు క్రికెట్‌కి మాత్రం అతను బాడీ సహకరించదు. ఈ విషయంలో సెలక్టర్లు కూడా క్లియర్‌గా ఉంటే బెటర్..

45
Image credit: PTI

వన్డే వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యాకి వైట్ బాల్ కెప్టెన్సీ దక్కొచ్చు. టెస్టు క్రికెట్‌లో మాత్రం కొత్త కెప్టెన్‌ని చూసుకోవాల్సిందే. కుర్రాళ్లను కెప్టెన్సీకి రెఢీ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి...
 

55
Image credit: Getty

రెడ్ బాల్ క్రికెట్ కెప్టెన్‌గా సెలక్ట్ చేయడం అంత తేలికైన విషయం కాదు. సెలక్టర్లు, హెడ్ కోచ్, రోహిత్ శర్మ అందరూ కలిసి కూర్చొని తర్వాతి టెస్టు కెప్టెన్ ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. 

Read more Photos on
click me!

Recommended Stories