నాన్న చనిపోయిన రోజే విరాట్ కోహ్లీ ఆడడానికి వచ్చాడు, డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడుస్తూ కూర్చున్నాడు...

Published : Mar 01, 2022, 03:23 PM IST

విరాట్ కోహ్లీ... ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో మకుటం లేని మహారాజు. క్రేజ్ విషయంలో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న విరాట్, గత దశాబ్ద కాలంలో పరుగుల వరద పారించడంలో అసాధ్యమైన రికార్డులు క్రియేట్ చేశాడు... 

PREV
114
నాన్న చనిపోయిన రోజే విరాట్ కోహ్లీ ఆడడానికి వచ్చాడు, డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడుస్తూ కూర్చున్నాడు...

విరాట్ కోహ్లీ టీనేజ్‌లో ఉన్న సమయంలోనే ఆయన తండ్రి ప్రేమ్ కోహ్లీ, బ్రెయిన్ స్ట్రోక్‌తో ప్రాణాలు విడిచారు... అదే రోజు విరాట్, బ్యాటు పట్టుకుని మ్యాచ్ ఆడడానికి వచ్చాడు...

214

‘2006లో రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరుపున మ్యాచ్ ఆడుతున్నాం. కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి నేను, విరాట్ కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు...

314

అదే రోజు సాయంత్రం విరాట్ కోహ్లీ వాళ్ల నాన్న ప్రేమ్ చనిపోయారు. ఒక్కసారి విరాట్ జీవితం తలకిందులైపోయింది...

414

తండ్రి లేడనే బాధను గుండెల్లో దిగమింగుతూ విరాట్ మ్యాచ్‌కి వచ్చాడు. అప్పటికి విరాట్ వయసు 17 ఏళ్లే. నాకు 19 ఏళ్లు. విరాట్ ముఖంలో బాధ తెలుస్తోంది. 

514

డ్రెస్సింగ్‌ రూమ్‌లో మూలన కూర్చొని ఏడుస్తున్నాడు. ఇప్పటికీ నాకు అది ఓ వింతగా అనిపిస్తుంది. తండ్రి చనిపోయిన పుట్టెడు దు:ఖంలో కూడా విరాట్ గ్రౌండ్‌లో ఎలా దిగగలిగాడు...

614

బ్యాటింగ్ చేసేందుకు రెఢీ అవుతున్న విరాట్ కోహ్లీ ధైర్యాన్ని చూసి మేమంతా ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయాం... అప్పటికి విరాట్ తండ్రి అంత్యక్రియలు కూడా పూర్తవ్వలేదు...

714

అయితే తన టీమ్ ఓడిపోకూడదనే ఉద్దేశంతో విరాట్ కోహ్లీ మ్యాచ్‌కి వచ్చాడు. అప్పుడు ఢిల్లీ కోచ్‌గా ఛేతన్ సర్ ఉన్నారు. మిథున్ భాయ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇద్దరూ కూడా విరాట్‌ని ఇంటికి వెళ్లి, జరగాల్సిన కార్యం చూడమని చెప్పారు...

814

కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఆడాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఆడుతున్నంతసేపు అతనిలో దు:ఖం కనిపించలేదు, లేక విరాట్ కఠినంగా మారిపోయాడేమో...

914

ఆ రోజు విరాట్ కోహ్లీ కొన్ని అద్భుతమైన షాట్స్ ఆడాడు, తన సిగ్నేచర్ కవర్ డ్రైవ్ కొట్టాడు. ఆ రోజు తనతో చాలా తక్కువగా మాట్లాడాను. అవుట్ కాకుండా ఆడు, ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని విరాట్ చెప్పడం ఇంకా గుర్తుంది...

1014

అతని మాటలకు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. తనకు ధైర్యం చెప్పేలా కొన్ని మాటలు చెప్పాలనుకున్నా, కానీ మళ్లీ ఆ విషయం గుర్తు చేయడం ఇష్టం లేక ఆట మీద ఫోకస్ పెట్టా...

1114

ఆ రోజు విరాట్ సెంచరీ మిస్ అయ్యాడు. కానీ జీవితంలో మాత్రం ఎన్నో సెంచరీలు కొట్టాడు. 17 ఏళ్లప్పుడు విరాట్ కోహ్లీ ఎలా ఉన్నాడో, 33 ఏళ్ల వయసులో అలాగే ఉన్నాడు...

1214

2012 తర్వాత విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్ పెట్టాడు. అండర్ 19 రోజుల్లోనూ విరాట్ కోహ్లీ డల్‌గా ఉండడం ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు అతను ఓ లెజెండ్...’ అంటూ చెప్పుకొచ్చాడు పునిత్ బిస్త్...

1314

ఢిల్లీ తరుపున ఆడే పునిత్ బిస్త్, 96 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 4378 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ తండ్రి మరణించిన రోజున విరాట్‌తో కలిసి 152 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు పునిత్..

1414

ఆ మ్యాచ్‌లో పునిత్ బిస్త్ 156 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 90 పరుగులు చేసి అవుటై, ఇంటికి వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు...

Read more Photos on
click me!

Recommended Stories