ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆరుసార్లు క్లీన్ బౌల్డ్... 100వ టెస్టుకి ముందు తీవ్రమైన ఒత్తిడిలో విరాట్ కోహ్లీ...

Published : Mar 03, 2022, 05:56 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు, మొహాలీ వేదికగా ప్రారంభం కానుంది. ఇండియా, శ్రీలంక మధ్య జరిగే ఈ మొదటి టెస్టు మ్యాచ్‌ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది....

PREV
112
ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆరుసార్లు క్లీన్ బౌల్డ్... 100వ టెస్టుకి ముందు తీవ్రమైన ఒత్తిడిలో విరాట్ కోహ్లీ...

కరోనా ఆంక్షల కారణంగా మొహాలీ టెస్టుకి తొలుత ప్రేక్షకులను అనుమతించేది లేదంటూ బీసీసీఐ స్పష్టం చేసినా, విరాట్ కోహ్లీ అభిమానుల డిమాండ్‌తో దిగి వచ్చింది...

212

మొహాలీ టెస్టుకి 50 శాతం కెపాసిటీతో ప్రేక్షకులను అనుమతిస్తామని తెలిపింది బీసీసీఐ. ఇప్పటికే ఈ టెస్టుకి సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి...

312

నాలుగు రోజుల ముందే మొహాలీ చేరుకుని, బీసీసీఐ క్యాంపులో చేరుకున్న విరాట్ కోహ్లీ... నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు..

412

కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ కావడంతో విరాట్ కోహ్లీతో తీసిన ప్రత్యేక ఇంటర్వ్యూని మ్యాచ్ సందర్భంగా టెలికాస్ట్ చేయబోతోంది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్...

512

ఎమ్మెస్ ధోనీ నుంచి 2014లో టెస్టు కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఓ సాధారణ ప్లేయర్‌గా, మాజీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఆడబోయే తొలి టెస్టు మ్యాచ్ ఇదే...

612

రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీలో జరగబోయే తొలి మ్యాచ్ కూడా ఇదే కావడంతో ఏర్పాట్లు భారీగానే ఉన్నాయి... అయితే విరాట్ మాత్రం తీవ్ర పెషర్‌లో ఉన్నట్టు తెలుస్తోంది...

712


మ్యాచ్ ఆరంభానికి ముందు రోజు మార్చి 3న ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్న విరాట్ కోహ్లీ... నెట్స్‌లో ఏకంగా ఆరుసార్లు బౌల్డ్ అయ్యాడు.
 

812

మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన విరాట్ కోహ్లీ, టీ20 సిరీస్‌లో ఆడిన రెండో టీ20లో హాఫ్ సెంచరీ బాదాడు...

912

బీసీసీఐతో విభేదాలతో పాటు గత రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ... నూరో టెస్టుకి ముందు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టు అర్థమవుతోంది..

1012

విరాట్ కోహ్లీ సెంచరీ లేకుండా 71వ ఇన్నింగ్స్ ఆడబోతున్నాడు. అదీకాకుండా టెస్టు క్రికెట్‌లో 100+ టెస్టులు ఆడబోతున్న 71వ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు...

1112

ఇన్ని 71ల మధ్యలో విరాట్ కోహ్లీ 71వ సెంచరీ రావాలని కోరుకుంటున్నారు అభిమానులు. అయితే ఫామ్‌ చూస్తే మాత్రం అది అంత ఈజీ కాదని తెలుస్తోంది...

1212

సెంచరీ చేయకపోయినా కనీసం ఓ మంచి ఇన్నింగ్స్‌తో మొహాలీ టెస్టును మెమొరబుల్‌గా మార్చుకుంటే చాలని అంటున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories