Published : Mar 03, 2022, 05:17 PM ISTUpdated : Mar 03, 2022, 05:48 PM IST
భారత టెస్టు టీమ్‌లో కీలక ప్లేయర్లుగా మారిపోయారు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా. అయితే రెండేళ్లుగా ఈ ఇద్దరి పర్ఫామెన్స్ దారుణంగా పడిపోతూ ఉండడంతో లంకతో జరిగే టెస్టు సిరీస్ నుంచి అజింకా రహానే, పూజారాలను తప్పించిన విషయం తెలిసిందే..
భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్లు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా ఇద్దరూ లేకుండా భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడడం గత 9 ఏళ్లలో ఇదే తొలిసారి...
210
2012లో ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్ టెస్టులో చివరిసారిగా అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా లేకుండా టెస్టు మ్యాచ్ బరిలో దిగింది భారత జట్టు...
310
ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, టెస్టుల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. 213 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 116 పరుగులు చేసి అవుట్ అయ్యాడు విరాట్...
410
భారత తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 272 పరుగులకి ఆలౌట్ కాగా, వృద్ధిమాన్ సాహా 35, గౌతమ్ గంభీర్ 34 పరుగులు చేసి విరాట్ తర్వాత టాప్ స్కోరర్లుగా నిలిచారు..
510
ఆ మ్యాచ్‌లో భారత జట్టు 298 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతుల్లో చిత్తుగా ఓడినా, టెస్టుల్లో విరాట్ కోహ్లీ సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోగలిగాడు...
610
2013, మార్చి 22న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెస్టు ఎంట్రీ ఇచ్చిన అజింకా రహానే, 82 టెస్టుల్లో 38.52 సగటుతో 4931 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి...
710
కెరీర్ ఆరంభంలో 45+ సగటుతో టెస్టుల్లో పరుగులు చేసిన అజింకా రహానే, గత మూడేళ్లుగా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఈ కారణంగా రహానే టెస్టు సగటు పడిపోతూ వచ్చింది...
810
2010లో ఆస్ట్రేలియాపైనే టెస్టు ఆరంగ్రేటం చేసిన ఛతేశ్వర్ పూజారా, ఇప్పటిదాకా 95 టెస్టు మ్యాచులు ఆడి 43.88 సగటుతో 6,713 పరుగులు చేశాడు...
910
18 టెస్టు సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు చేసిన ఛతేశ్వర్ పూజారా కెరీర్‌లో మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి...
1010
చివరిసారిగా పూజారా, రహానే లేకుండా భారత జట్టు ఆడిన టెస్టులో కోహ్లీ సెంచరీ చేయడంతో ఈసారి కూడా విరాట్ బ్యాటు నుంచి అలాంటి ఇన్నింగ్స్ రావాలని కోరుకుంటున్నారు అభిమానులు...