సచిన్ టెండూల్కర్‌, విరాట్ కోహ్లీలలో ఎవరు గ్రేటెస్ట్... సరిగ్గా 99 టెస్టుల తర్వాత...

Published : Mar 03, 2022, 04:49 PM IST

విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌కి మధ్య చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయి. తండ్రి చనిపోయిన తర్వాత ఆ బాధను గుండెల్లో దాచుకుని, క్రికెట్ క్రీజులో అడుగుపెట్టడం దగ్గర్నుంచి వన్డేల్లో అత్యధిక స్కోరు (సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీకి ముందు) దాకా ఇద్దరికీ చాలా పోలికలు ఉన్నాయి...

PREV
19
సచిన్ టెండూల్కర్‌, విరాట్ కోహ్లీలలో ఎవరు గ్రేటెస్ట్... సరిగ్గా 99 టెస్టుల తర్వాత...

సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 100 అంతర్జాతీయ సెంచరీలు బాదితే, విరాట్ కోహ్లీ 14 ఏళ్ల కెరీర్‌లో 70 సెంచరీలు నమోదు చేశాడు...

29

అయితే సచిన్ కంటే విరాట్ కోహ్లీ గ్రేట్ అని కొందరు... లేదు, క్రికెట్ గాడ్‌ని ఏ క్రికెటర్ చేరుకోలేడని మరికొందరు వాదిస్తూనే ఉంటారు... మరి ఇద్దరిలో ఎవరు బెస్ట్?

39

సరిగ్గా 99 టెస్టు మ్యాచుల తర్వాత సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో 159 ఇన్నింగ్స్‌ల్లో 8351 పరుగులు చేశాడు... ఆ సమయానికి సచిన్ యావరేజ్ 57.99...

49

కేప్‌టౌన్ టెస్టుతో 99 టెస్టు ఆడిన విరాట్ కోహ్లీ, 168 ఇన్నింగ్స్‌ల్లో 7962 పరుగులు చేశాడు. విరాట్ టెస్టు యావరేజ్ 50.39గా ఉంది...

59

99 టెస్టులు ఆడే సమయానికి ‘లిటిల్ మాస్టర్’ సచిన్ టెండూల్కర్ 30 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు సాధించాడు...

69

ప్రస్తుతం విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 27వ టెస్టు సెంచరీ చేసే సమయానికి 22 హాఫ్ సెంచరీలు మాత్రమే చేసిన కోహ్లీ, రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు...

79

సచిన్ టెండూల్కర్‌ కంటే టెస్టు కెప్టెన్‌గా మాత్రం విరాట్ కోహ్లీ అందనంత ఎత్తులో ఉన్నాడు. టెస్టుల్లో 40 విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ, విదేశాల్లో అత్యధిక విజయాలు అందుకున్న భారత సారథిగా నిలిచాడు...

89

సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 200 టెస్టు మ్యాచులు ఆడితే, 32 ఏళ్ల వయసులో 100వ టెస్టు ఆడుతున్న విరాట్ కోహ్లీ... 150+ టెస్టులు ఆడడం కూడా అనుమానమే...

99

అన్నింటికీ మించి రెండున్నరేళ్లుగా 71వ సెంచరీ అందుకోలేకపోతున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డును అందుకోవాలంటే అనితర సాధ్యమైన రితీలో సెంచరీల మోత మోగించాల్సి ఉంటుంది...

Read more Photos on
click me!

Recommended Stories