రూ.19 కోట్లతో ఫామ్ హౌజ్ కట్టుకుంటున్న విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ... రోహిత్, రవిశాస్త్రిలకు...

First Published Sep 2, 2022, 2:28 PM IST

ప్రపంచంలో బ్రాండ్ అంబాసిడర్‌గా అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలోనూ అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారత సెలబ్రిటీగా ఉన్నాడు. కొన్ని వేల కోట్లకు అధిపతిగా మారిన విరాట్ కోహ్లీ, రూ.19 కోట్లతో ఓ ఖరీదైన ఫామ్ హౌజ్ కొనుగోలు చేశాడట...

ముంబై సిటీలోని అలీబాగ్ ఏరియాలో ఓ విలాసవంతమైన ఫామ్ హౌజ్‌ని విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులు కొనుగోలు చేశారట. అలీబాగ్ ఏరియాలో చాలామంది సెలబ్రిటీలు వెకేషన్ ఇళ్లను కట్టుకున్నారు... విరుష్క దంపతులు కూడా ఈ లిస్టులో చేరారు...

అలీబాగ్‌లోని జిరడ్ అనే గ్రామానికి దగ్గర్లో 8 ఎకరాల్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల విలాసవంతమైన ఫామ్ హౌజ్ నిర్మించబోతున్నారు. దీని వెల అక్షరాల 19 కోట్ల 24 లక్షల 50 వేల రూపాయలని సమాచారం. ఇప్పటికే దీనికోసం ప్రభుత్వానికి రూ.1 కోటి 15 లక్షలు పన్ను రూపంలో చెల్లించారు... స్టాంపు డ్యూటీ నిమిత్తం మరో 3 లక్షల, 35 వేలు చెల్లించారు విరుష్క జోడీ.. 

ప్రస్తుతం విరాట్ కోహ్లీ, ఆసియా కప్ 2022 టోర్నీ కోసం దుబాయ్‌లో ఉన్నాడు. అలాగే అనుష్క శర్మ కూడా ‘చడ్డా ఎక్స్‌ప్రెస్’ మూవీ కోసం ఇంగ్లాండ్‌లో ఫాస్ట్ బౌలింగ్ ట్రైయినింగ్ తీసుకుంటోంది. దీంతో విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ, ఈ ఫామ్ హౌజ్‌కి సంబంధించిన పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు...
 

ఈ స్థలంలో ఫామ్ హౌజ్ కట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న విరుష్క దంపతులు, 6 నెలల క్రితమే జిరడ్ గ్రామానికి వెళ్లి, అక్కడ స్థలాన్ని పరిశీలించి వచ్చారు. ఇదే ఏరియాలో భారత మాజీ క్రికెటర్, టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, భారత ప్రస్తుత సారథి రోహిత్ శర్మలకు ఇళ్లు ఉన్నారు...

Ravi Shastri and Virat Kohli

రవిశాస్త్రి పదేళ్ల క్రితమే అలీబాగ్ ఏరియాలో ఇళ్లు కట్టుకోగా రోహిత్ శర్మ, ఈ ఏడాది ఆరంభంలో ఇక్కడ ఇళ్లు కట్టుకునేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. అలీబాగ్‌ సిటీకి 20 కి.మీ.ల దూరంలో ఉన్న సరళ్ మహాత్రోలి అనే గ్రామంలో 4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు రోహిత్ శర్మ.

గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్‌కి దూరమైన సమయంలోనే భార్య రితికా పేరటి అలీబాగ్‌లో స్థలం కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్ ఇద్దరూ కలిసి రావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ స్థలంలో రోహిత్- రితికాల ఫామ్ హౌజ్ నిర్మాణ దశలో ఉంది...

click me!