ఇకనైనా ఆరెంజ్ క్యాప్ కోసం ఆడడం మానేస్తే బెటర్... కెఎల్ రాహుల్‌పై హర్షా భోగ్లే కామెంట్...

First Published Sep 2, 2022, 1:01 PM IST

ఐపీఎల్‌లో కెఎల్ రాహుల్‌కి ఓ స్పెషల్ గుర్తింపు ఉంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన కెఎల్ రాహుల్, తనకి పోటీగా వస్తున్నాడనే కారణంగా ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్‌ని కూడా టీమ్‌ నుంచి తప్పించాడు. తాజాగా దీనిపై క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి...

Suryakumar Yadav KL Rahul

టీమ్‌ ప్లేఆఫ్స్ చేరినా, గెలిచినా గెలవకపోయినా ఆరెంజ్ క్యాప్ కోసం క్రీజులో పాతుకుపోయి ఆడుతుంటాడని కెఎల్ రాహుల్‌పై తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి, వస్తున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్ సమయంలో తాను ఆరెంజ్ క్యాప్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని స్వయంగా కామెంట్ చేశాడు కెఎల్ రాహుల్...

KL Rahul

ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ 600+ పరుగులు చేసిన కెఎల్ రాహుల్, 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి మారిన తర్వాత కూడా అదే రకమైన ఆటతీరు కనబరిచాడు. ఈసారి 600+ పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత గాయంతో ఆటకు దూరమయ్యాడు...

KL Rahul

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభానికి ఒక్క రోజు ముందు కెఎల్ రాహుల్ గాయం బయటపడడంతో అతను దాదాపు రెండు నెలల పాటు జట్టుకి దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సమయానికి కెఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తాడని ఆశించినా, కరోనా కారణంగా అది వీలు కాలేదు...

జింబాబ్వే టూర్‌లో రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2022 టోర్నీతో కలిపి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసినా 100+ స్ట్రైయిక్ రేటుతో ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. పాక్‌పై గోల్డెన్ డకౌట్ అయినా కెఎల్ రాహుల్, జింబాబ్వేతో రెండో వన్డేలో 5 బంతులాడి 1 పరుగుకే పెవిలియన్ చేరాడు...

‘కెఎల్ రాహుల్ గాయం తర్వాత ఆడుతున్నాడు. అయితే హంగ్ కాంగ్‌పై 39 బంతులాడి 36 పరుగులే చేయడం కరెక్ట్ కాదు. హంగ్ కాంగ్‌పై ఎలాగైనా గెలుస్తామని తెలుసు. విరాట్ కోహ్లీ ఆరంభంలో ఎక్కువ బంతులు తీసుకున్నా తర్వాత సెటిల్ అయ్యాడు..

KL Rahul

కెఎల్ రాహుల్ మాత్రం తన టచ్‌ చూపించలేకపోతున్నాడు. అతనికి నెట్స్‌లో చాలా ప్రాక్టీస్ అవసరం. కెఎల్ రాహుల్ చాలా టాలెంటెడ్ ప్లేయర్. అయితే అతన్ని ఎక్కడో ఆగిపోతున్నాడు. నా ఉద్దేశం ప్రకారం కెఎల్ రాహుల్‌లో ఎక్కడో ఓ మూల భయం ఉండి పోయింది...

Image credit: PTI

అవుట్ అవుతాననే భయాన్ని జయించినప్పుడు కెఎల్ రాహుల్ నుంచి మరింత మెరుగైన ఇన్నింగ్స్‌లు వస్తాయి. ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ కోసం ఆడడం మానేస్తాడేమో చూడాలి.. ఆసియా కప్‌లో ఇంకా నాలుగు మ్యాచులు ఉన్నాయి...

ఈ నాలుగు మ్యాచుల్లో కూడా కెఎల్ రాహుల్ రిథమ్‌లోకి రాకపోతే టీమిండియా సెలక్టర్లకు చాలా పెద్ద పని పడుతుంది. ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న రాహుల్‌ని టీ20 వరల్డ్ కప్ ఆడించే సాహసం చేసేందుకు వాళ్లు ఆలోచించాల్సి వస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే... 

click me!