కుటుంబంతో సహా వచ్చేయండి... క్రికెటర్ల భార్యా, పిల్లలను తీసుకొచ్చేందుకు యూకే ప్రభుత్వం అనుమతి...

Published : Jun 01, 2021, 11:15 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌కి వెళ్తున్న భారత జట్టు, సెప్టెంబర్ నెల దాకా అక్కడే ఉండబోతోంది. దీంతో కుటుంబంతో సహా ఇంగ్లాండ్ టూర్‌కి వచ్చేందుకు యూకే ప్రభుత్వం అనుమతిచ్చింది. విరాట్ కోహ్లీతో పాటు చాలామంది క్రికెటర్లు భార్యాపిల్లలతో ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కబోతున్నారు.

PREV
19
కుటుంబంతో సహా వచ్చేయండి... క్రికెటర్ల భార్యా, పిల్లలను తీసుకొచ్చేందుకు యూకే ప్రభుత్వం అనుమతి...

జూన్ 2న భారత మహిళా జట్టుతో కలిసి పురుషుల జట్టు కూడా కుటుంబాలతో కలిసి ఒకే ఫ్లైట్‌ల లండన్ చేరుకోబోతున్నారు. లండన్ చేరుకున్న తర్వాత అక్కడి హోటెల్‌లో మూడు రోజుల పాటు కఠిన క్వారంటైన్‌లో గడుపుతారు.

29

వాస్తవానికి భారత్‌తో సహా విదేశాల నుంచి వచ్చేవాళ్లు, లండన్‌లో 10 రోజుల క్వారంటైన్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే బయో బబుల్ ఏర్పాటు చేసి ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచిన బీసీసీఐ, ఆ గడువును మూడు రోజులకి తగ్గించింది.

39

ఇంగ్లాండ్‌లో భారత క్రికెటర్లకు, వారి కుటుంబాలకు మరోసారి కరోనా టెస్టులు నిర్వహిస్తారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత బయో బబుల్ జోన్‌లోకి అడుగుపెట్టి ప్రాక్టీస్ మొదలెడతారు..

49

సౌంతిప్టన్ వేదికగా జూన్ 18 నుంచి న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే టీమిండియా, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తుంది.

59

అంటే సెప్టెంబర్ 15వరకూ ఇంగ్లాండ్‌లోనే ఉండబోతోంది భారత జట్టు. వరల్డ్ టెస్టు ఛాంపియన‌షిప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత దాదాపు 42 రోజుల పాటు ఇంగ్లాండ్‌‌లో హాలీడేస్ ఎంజాయ్ చేయబోతున్నారు భారత క్రికెటర్లు.

69

అయితే ఈ గ్యాప్‌లో ఐర్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్ నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నా, దాని గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆ సిరీస్ కూడా లేకపోతే 24 మంది భారత క్రికెటర్లు, వారి ఫ్యామిలీలు ఇంగ్లాండ్‌లో షికార్లు చేస్తూ, షాపింగ్‌ చేస్తూ కాలం గడపాల్సిందే..

79

విరాట్ కోహ్లీ ఆయన భార్య అనుష్క శర్మ, కూతురు వామికలతో పాటు తొలిసారి ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్తున్నారు. ఇంతకుముందు అనుష్క శర్మ, ఇంగ్లాండ్ టూర్‌లో కనిపించడం, ఆ జట్టులో రోహిత్ శర్మకు చోటు లేకపోవడంతో తీవ్ర వివాదాస్పదమైంది.

89

రోహిత్ శర్మకు బదులుగా జట్టుతో పాటు అనుష్క శర్మ ఉందంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయడం, దానికి రోహిత్ శర్మ లైక్ కొట్టడంతో తీవ్ర దుమారం రేగింది. ఆ తర్వాత అనుష్క శర్మను రోహిత్ శర్మ అన్‌ఫాలో కావడంతో రోహిత్, విరాట్ మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి.

99

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ అనంతరం ఈ మనస్పర్థలకు ఫుల్‌స్టాప్ పడినట్టు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సన్నిహితంగా ఉన్న ఫోటోల ద్వారా తెలిసింది. దీంతో రోహిత్ శర్మ అండ్ ఫ్యామిలీతో విరాట్ కోహ్లీ అండ్ ఫ్యామిలీ వెళ్తుంది లాంగ్ టూర్ ఇది.

click me!

Recommended Stories