ఆ విషయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కంటే ముందున్న దినేశ్ కార్తీక్... అయినా జట్టులో...

First Published Jun 1, 2021, 10:07 AM IST

దినేశ్ కార్తీక్... భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే టీమిండియాలోకి వచ్చిన వికెట్ కీపర్. ఒంటి చేత్తో మ్యాచులను గెలిపించిన గల సత్తా ఉన్న క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ దినేశ్ కార్తీక్‌కి రావాల్సినంత గుర్తింపు రాలేదు... దినేశ్ కార్తీక్ పుట్టినరోజు నేడు...

దినేశ్ కార్తీక్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే ఇన్నింగ్స్... 2018 నిదహాస్ ట్రోఫీ ఫైనల్. ఆఖరి రెండు ఓవర్లలో 34 పరుగులు కావాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్, 8 బంతుల్లో 29 పరుగులు చేసి భారత జట్టును అద్భుత విజయాన్ని అందించాడు.
undefined
ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాల్సిన సమయంలో ఇక గెలిచినట్టే భావించిన బంగ్లాదేశ్, చివరి బంతికి ముందే గెలిచేసినట్టు సంబరాలు చేసుకుంది. అయితే ఆఖరి బంతికి అద్భుతమైన సిక్సర్ బాదిన దినేశ్ కార్తీక్, టీమిండియాకి విజయాన్ని అందించాడు.
undefined
ఇలా ఆఖరి బంతికి సిక్సర్ బాది భారత జట్టుకి రెండుసార్లు విజయాలు అందించిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ మాత్రమే. అయితే ధోనీ వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా జట్టులో స్థానం స్థుస్థిరం చేసుకోవడంతో కార్తీక్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు.
undefined
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా కొనసాగుతున్నా భారత జట్టు తరుపున 150కి పైగా మ్యాచులు ఆడాడు దినేశ్ కార్తీక్. ‘మహేంద్ర సింగ్ ధోనీ టాపర్‌గా ఉన్న యూనివర్సిటీలో నేను ఓ విద్యార్థిని’ మాత్రమే అని ప్రకటించిన నిస్వార్థమైన క్రికెటర్ దినేశ్ కార్తీక్.
undefined
టీ20ల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన మొట్టమొదటి భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్. తమిళనాడు జట్టుకి ఎన్నో విజయాలు అందించిన దినేశ్ కార్తీక్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, వరుణ్ చక్రవర్తి వంటి ఎందరో యువక్రికెటర్లు జట్టులోకి రావడానికి కారణమయ్యాడు.
undefined
దినేశ్ కార్తీక్ టీ20ల్లో బెస్ట్ ఫినిషర్లలో ఒకడు. భారత జట్టు తరుపున 32 టీ20 మ్యాచులు ఆడిన దినేశ్ కార్తీక్, 146.15 స్ట్రైయిక్ రేటుతో 399 పరుగులు చేశాడు. ఇందులో 42 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి.
undefined
హార్ధిక్ పాండ్యా 147.66 స్ట్రైయిక్ రేటు తర్వాత అత్యధిక స్ట్రైయిక్ కలిగిన భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్. వీరేంద్ర సెహ్వాగ్145.38, కెఎల్ రాహుల్ 142.19, విరాట్ కోహ్లీ 139.04, రోహిత్ శర్మ 138.96 కూడా దినేశ్ కార్తీక్ కంటే వెనకే ఉన్నారు.
undefined
35 ఏళ్ల దినేశ్ కార్తీక్, ప్రస్తుతం ఐపీఎల్‌లో, దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతూనే కామెంటేటర్‌గా కూడా వ్యవహారించబోతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కి కామెంటేటర్‌గా వ్యవహారించిన డీకే, వరల్డ్ టెస్టు ఛాంపిన్‌షిప్ ఫైనల్‌కి కూడా కామెంటేటర్‌గా వ్యవహారించనున్నాడు.
undefined
ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడైన దినేశ్ కార్తీక్, వికెట్ల వెనకాల కళ్లు చెదిరే క్యాచులు అందుకుంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
undefined
click me!