Kohli vs Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా? నెట్ ప్రాక్టీస్‌లో బయటపడ్డ అసలు సీన్ !

Published : Jul 14, 2026, 02:52 PM IST

Kohli and Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాల వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పుకార్లలో ఎంతవరకు నిజం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
గంభీర్-కోహ్లీ మధ్య మళ్లీ లొల్లి? నెట్స్ లో అసలు ఏం జరిగింది?

మంగళవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ షురూ కాబోతోంది. ఈ సిరీస్ కోసం సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. అయితే, సిరీస్ ప్రారంభానికి ముందు జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో అందరి కళ్లూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీలపైనే పడ్డాయి.

ప్రాక్టీస్ చేస్తున్న టైంలో వీళ్లిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వీరి మధ్య మళ్లీ పాత గొడవలు మొదలయ్యాయా? అసలు వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదా? అనే రూమర్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.

25
ప్రాక్టీస్ సెషన్స్ లో ఏం జరిగింది?

నెట్ ప్రాక్టీస్ సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్ మిగిలిన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ లాంటి వాళ్లతో చాలా సేపు మాట్లాడుతూ కనిపించారు. కానీ, విరాట్ కోహ్లీతో మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. కోహ్లీ తన ప్రాక్టీస్ సమయాన్ని ఎక్కువగా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ పర్యవేక్షణలోనే గడిపాడు. ఈ సీన్ చూసిన అభిమానులు, మీడియా.. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని డౌట్ పడుతున్నారు. గంభీర్-కోహ్లీ మధ్య మళ్లీ గ్యాప్ పెరిగిందా? అనే రూమర్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయి.

35
ఈ కోల్డ్ వార్ రూమర్ల వెనుక ఉన్న నిజం ఏంటి?

ప్రస్తుతానికి విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది కేవలం రూమర్ మాత్రమే. కాకపోతే, గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల్లో వీరిద్దరి మధ్య ఉన్న పాత విభేదాల వల్ల.. ఇప్పుడు ప్రాక్టీస్ గ్రౌండ్‌లో మాట్లాడకపోవడం పెద్ద ఇష్యూగా మారింది. మైదానంలో వారి పద్ధతులు, ఆలోచనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, వారిద్దరూ ప్రొఫెషనల్‌గా కలిసి పనిచేయడానికే మొగ్గు చూపుతారు. కానీ, ప్రాక్టీస్ సమయంలో కనిపించిన ఈ సైలెన్స్ అభిమానులను కంగారు పెడుతోంది.

45
గంభీర్ పై వస్తున్న విమర్శలు

మరోవైపు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఈ మధ్య కాలం పెద్దగా కలిసి రాలేదు. టీ20 సిరీస్‌లలో ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లపై వరుసగా పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. ఆ రెండు సిరీస్‌ల్లో టీమిండియా ఘోరంగా వైట్‌వాష్ అయింది. దీంతో గంభీర్ కోచింగ్ శైలిపై స్వదేశీ మీడియా, అభిమానుల నుంచి గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కోహ్లీతో కోల్డ్ వార్ రూమర్స్ రావడం గంభీర్ ఇమేజ్‌కు మరింత ఇబ్బందిగా మారింది.

55
రాబోయే వరల్డ్ కప్ సవాల్

ఈ వన్డే సిరీస్ భారత్‌కు చాలా ముఖ్యం. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో టీమిండియా ఎలా ప్రిపేర్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్ ప్లేయర్ కోహ్లీ, హెడ్ కోచ్ గంభీర్ ఇద్దరూ ఒకే తాటిపై ఉండి టీమ్‌ను నడిపిస్తేనే రాబోయే మెగా టోర్నీల్లో భారత్ విజయం సాధించగలదు. వీరిద్దరి మధ్య ఎలాంటి చిన్న విభేదాలు ఉన్నా అది టీమ్ పర్ఫార్మెన్స్ పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. కాబట్టి, రూమర్స్ పక్కనపెట్టి ఇద్దరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories