విరాట్‌కి ఆ విషయం తెలుసు, అందుకే త్వరగా అవుట్ అయ్యాడు... కోహ్లీకి పియూష్ చావ్లా సపోర్ట్...

Published : Jul 10, 2022, 07:15 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సమైన చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్ వంటి ప్లేయర్లు అవకాశం దొరికినప్పుడల్లా అదరగొడుతుండడంతో కోహ్లీని టీ20ల నుంచి తప్పించాలనే డిమాండ్ పెరుగుతోంది...

PREV
17
విరాట్‌కి ఆ విషయం తెలుసు, అందుకే త్వరగా అవుట్ అయ్యాడు... కోహ్లీకి పియూష్ చావ్లా సపోర్ట్...
Image credit: Getty

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 1 పరుగుకే అవుటై పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్ తరుపున మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడుతున్న రిచర్డ్ గ్లీసన్... రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌లను నాలుగు బంతుల గ్యాప్‌లో అవుట్ చేశాడు...

27

విరాట్ కోహ్లీ 1 పరుగుకే అవుట్ కావడంతో అతన్ని టీ20 టీమ్‌లో ఎంపిక చేయడం వ్యర్థమంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా... తాను కెప్టెన్‌గా ఉంటే అతన్ని సెలక్ట్ చేయనంటూ వ్యాఖ్యానించాడు.

37

కేవలం విరాట్ కోహ్లీ కీర్తి ప్రతిష్టలతో ఎంతో కాలం జట్టులో నెట్టుకురాలేడని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కామెంట్ చేశాడు. అశ్విన్‌ని టెస్టుల నుంచి తప్పించినప్పుడు, కోహ్లీని టీ20ల్లో నుంచి తప్పించడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించాడు కపిల్ దేవ్...

47

‘ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా అటాకింగ్ బ్రాండ్ క్రికెట్‌తో బరిలో దిగుతోంది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి షాట్స్ ఆడడం విరాట్‌ స్టైల్ ఆఫ్ గేమ్ కాదు.. అయితే తనకంటే ఎప్పుడూ టీమ్‌కే ప్రాధాన్యం ఇస్తాడు విరాట్ కోహ్లీ..

57

క్రీజులో ఉండాలి, ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని అనుకుంటే విరాట్ కోహ్లీ అలాంటి షాట్ ఆడేవాడు కాదు. అయితే టీమ్‌ అటాకింగ్ గేమ్ ఆడాలని డిసైడ్ కావడంతో షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.. 

67

ఫామ్‌లో లేనప్పుడు ఏం చేసినా కలిసి రాదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ లక్ కూడా బాగోలేనట్టుంది.. అందుకే పరుగులు చేయడానికి కష్టపడుతున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా...

77

‘విరాట్ కోహ్లీ ఏం చేయగలడో అందరికీ తెలుసు. అతని సత్తాపై ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఒకే ఒక్క ఇన్నింగ్స్ సరైనది పడితే, ఇప్పుడు కోహ్లీని విమర్శిస్తున్న నోళ్లన్నీ మూసుకుపోతాయి.. ’ అంటూ వ్యాఖ్యానించాడు పియూష్ చావ్లా...
 

Read more Photos on
click me!

Recommended Stories