England vs India: ఇంగ్లాండ్ తో ఎడ్జబాస్టన్ టెస్టులో ఓటమిపాలైన తిరిగి టీ20లలో భారత్ పుంజుకుంది. రెండు టీ20లలో గెలిచి సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది.
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ పై టీ20 సిరీస్ విజయానికి భారత ఆటగాళ్లు అర్హులని అఫ్రిది అభిప్రాయపడ్డాడు.
28
రోహిత్ సేనపై ప్రత్యేక ప్రశంసలు కురిపించిన అఫ్రిది..రాబోయే టీ20 ప్రపంచకప్ ను గెలవబోయే జట్లలో టీమిండియా కూడా ఫేవరేట్ అని తెలిపాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో భారత బౌలింగ్ గురొంచి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
38
ఇంగ్లాండ్ తో భారత జట్టు రెండో టీ20 ముగిసిన తర్వాత ట్విటర్ వేదికగా అఫ్రిది స్పందిస్తూ.. ‘భారత జట్టు ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడింది. ఈ సిరీస్ విజయానికి వాళ్లు అర్హులు. ముఖ్యంగా భారత జట్టు బౌలింగ్ ఆకట్టుకుంది.
48
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు ట్రోఫీ నెగ్గే సత్తా ఉన్న జట్లలో హాట్ ఫేవరేట్ అనడంలో సందేహం లేదు..’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
58
కాగా రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాక అతడి నాయకత్వంలో భారత్ కు ఇది వరుసగా నాలుగో టీ20 సిరీస్ విజయం. టీ20లలో కెప్టెన్ గా కోహ్లి నిష్క్రమించాక రోహిత్ వరుసగా న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక పై టీ20 సిరీస్ లు నెగ్గాడు.
68
Image credit: Getty
తాజాగా అతడు ఇంగ్లాండ్ తో రెండు టీ20 లు నెగ్గి సిరీస్ ను దక్కించుకున్నాడు. ఒకవేళ ఆదివారం జరుగబోయే చివరి మ్యాచ్ లో కూడా ఇంగ్లాండ్ ను ఓడిస్తే రోహిత్ కు ఇది టీ20లలో వరుసగా నాలుగు జట్లను వైట్ వాష్ చేసిన కెప్టెన్ అవుతాడు.
78
ఇక ఆస్ట్రేలియా లో జరుగబోయే ప్రపంచకప్ విషయానికొస్తే భారత జట్టు ఆ మేరకు పూర్తి సన్నద్ధమవుతున్నదని శనివారం ఇంగ్లాండ్ తో రెండో మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ చెప్పిన విషయం తెలిసిందే. తాము ఖాళీలన్నింటినీ ఒక్కొక్కటిగా పూరిస్తున్నామని చెప్పాడు.
88
Bhuvneshwar Kumar
తొలి టీ20లో భారత బ్యాటర్లు జోరు చూపించారు. కానీ రెండో టీ20లో కీలక బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు మాత్రం ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల దాటికి రెండు మ్యాచులలో ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది.