వాస్తవానికి ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో వినేశ్.. మంగళవారమే తొలి రౌండ్ లో 0-7తో మంగోలియా కు చెందిన ఖులాన్ బత్కుయోగ్ చేతిలో ఓడింది. అయితే ఖులాన్ ఫైనల్ చేరడంతో ‘రెపిచాజ్’విధానం ద్వారా వినేశ్ కు కాంస్య పతకంలో పోటీ పడే అవకాశం దక్కింది. ఈ విజయం ద్వారా ప్రపంచ ఛాంపియన్షిప్ చరిత్ర లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ గా వినేశ్ రికార్డు నెలకొల్పింది.