Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ.. కేరళ కెప్టెన్ గా సంజూ శాంస‌న్.. బ్యాట్ తో స‌మాధాన‌మిస్తాడా?

First Published | Nov 23, 2023, 10:17 AM IST

Sanju Samson: విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో కేరళ గురువారం తన తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ సౌరాష్ట్రతో సంజూ శాంసన్ అండ్ కో తలపడనుంది.
 

Kerala cricket team: విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ జట్టుకు సంజూ శాంసన్ నాయకత్వం వహించనున్నాడు. వైస్ కెప్టెన్ గా రోహన్ ఎస్ కుణ్నుమ్మాల్ వ్యవహరిస్తున్నాడు. ఎం.వెంకటరమణ చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. 
 

విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ లో కేరళ, సౌరాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. ఆలూరులోని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేరళ క్రికెట్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
 


భారత జట్టుకు దూరమైన సంజూ శాంసన్ నుంచి మంచి ప్రదర్శన కోసం అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచింది.

Sanju Samson

కేరళ జట్టు: సంజు శాంసన్ (కెప్టెన్), రోహన్ ఎస్. కున్నుమ్మల్, విష్ణు వినోద్, శ్రేయాస్ గోపాల్, మహ్మద్ అజారుద్దీన్, అబ్దుల్ బాసిత్, సచిన్ బేబీ, సిజోమన్ జోసెఫ్, వైశాఖ్ చంద్రన్, బాసిల్ థంపి, సల్మాన్ నిసార్, అజినాస్.ఎం, అఖిల్ స్కారియా, బాసిల్ ఎన్. .పి, అఖిన్ సత్తార్, మిథున్ ఎస్.

సౌరాష్ట్ర జ‌ట్టు: జయదేవ్ ఉనద్కత్ (కెప్టెన్), షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), అర్పిత్ వాసవాడ, హార్విక్ దేశాయ్, ప్రేరక్ మాంగడ్, చిరాగ్ జానీ, ధర్మేంద్ర సింగ్ జడేజా, పరాత్ భట్, సమర్థ్ వ్యాస్, విశ్వరాజ్ సింగ్ జడేజా, అంకుర్ పన్వార్. 

గ్రూప్-ఏలో ముంబ‌యి, రైల్వేస్, త్రిపుర, పాండిచ్చేరి, సిక్కిం, ఒడిశాతో పాటు కేరళ, సౌరాష్ట్రలు ఉన్నాయి. భారత ట్వంటీ 20 జట్టు నుంచి తప్పుకున్న సంజూ శాంసన్ విజయ్ హజారే టోర్న‌మెంట్ లో బ్యాట్ తోనే సమాధానం చెబుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Latest Videos

click me!