ఫిబ్రవరి 20 నుంచి విజయ్ హాజరే ట్రోఫీ... 13 నుంచి బయో బబుల్‌లోకి క్రికెటర్లు...

First Published Feb 7, 2021, 1:33 PM IST

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీని విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ, విజయ్ హాజరే ట్రోఫీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 20 నుంచి మొదలయ్యే  ఈ వన్డే టోర్నీ, మార్చి 14న ముగుస్తుంది. ఫిబ్రవరి 13లోపు ఆటగాళ్లు అందరూ బయో సెక్యులర్ జోన్‌లోకి వచ్చి, మూడు విడుదల కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు నగరాల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు.

సూరత్, ఇండోర్, బెంగళూరు, కోల్‌కత్తా, జైపూర్‌తో తమిళనాడులో విజయ్ హాజారే ట్రోఫీ నిర్వహించనున్నారు. ఎలైట్ గ్రూప్ ఏలో గుజరాత్, ఛత్తీస్‌ఘడ్, హైదరాబాద్, త్రిపుర, బరోడా, గోవా జట్లు ఉంటాయి. ఈ గ్రూప్‌కి సంబంధించిన మ్యాచులు సూరత్ నగరంలో జరుగుతాయి.
undefined
గ్రూప్ బీలో తమిళనాడు, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్ జట్లు ఉంటాయి. ఈ గ్రూప్‌కి సంబంధించిన మ్యాచులన్నీ ఇండోర్ వేదికగా జరుగుతాయి. గ్రూప్ సీలో కర్ణాటక, యూపీ, కేరళ, ఒడిస్సా, బీహార్, రైల్వేస్ జట్లు భాగంగా ఉన్నాయి. గ్రూప్ సీ మ్యాచులన్నీ బెంగళూరు వేదికగా జరుగుతాయి.
undefined
గ్రూప్ డీలో ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పుదుచ్చేరి జట్లు ఉంటాయి. గ్రూప్ డీకి సంబంధించిన మ్యాచులన్నీ జైపూర్ వేదికగా జరుగుతాయి. గ్రూప్ ఈలో జమ్మూ కశ్మీర్, సౌరాష్ట్ర, హర్యానా, ఛండీఘర్, సర్వీసెస్ జట్లు ఉంటాయి. ఈ గ్రూప్ మ్యాచులన్నీ కోల్‌కత్తా వేదికగా జరుగుతాయి.
undefined
ప్లేట్ గ్రూప్‌లో ఉత్తరాఖండ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్సీం జట్లు ఉంటాయి. ఈ గ్రూప్ మ్యాచులన్నీ తమిళనాడులో జరుగుతాయి.
undefined
భారత స్టార్ ప్లేయర్లు శ్రేయాస్ అయ్యర్‌తో పాటు నటరాజన్, శివమ్ దూబే, పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, దవళ్ కుల్‌కర్ణి, కరణ్ నాయర్, దేవ్‌దత్ పడిక్కల్, అర్జున్ టెండూల్కర్ వంటి ప్లేయర్లు విజయ్ హాజారే ట్రోఫీలో పాల్గొనబోతున్నారు.
undefined
click me!