ట్రోల్స్ చేసిన వ్యక్తితోనే పొగిడించుకున్న రాహుల్... బ్రిలియెంట్ ఇన్నింగ్స్ అంటూ వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్‌..

First Published Mar 17, 2023, 10:35 PM IST

ఎప్పుడూ భజన చేసేవాడు పొడిగితే ఎలా ఉంటుందో తెలీదు కానీ మనం వేస్ట్, టీమ్‌లో ఉండడానికి కూడా పనికి రామని చెప్పని వాడు పొగిడితే మాత్రం ఆ ఫీల్ వేరేగా ఉంటది. ప్రస్తుతం ఇదే రకమైన ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాడు మిస్టర్ లోకేశ్ రాహుల్..

కెఎల్ రాహుల్‌ని టెస్టు టీమ్ నుంచి తొలగించి, శుబ్‌మన్ గిల్‌కి అవకాశం ఇవ్వాలని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు. అయితే మధ్యలో వచ్చిన ఆకాశ్ చోప్రా, కెఎల్ రాహుల్ ప్రాధాన్యం గురించి వివరించేందుకు ప్రయత్నించాడు. ఆకాశ్ చోప్రా మధ్యలో కలిగించుకోకపోతే వెంకటేశ్ ప్రసాద్ ఈ విషయాన్ని ఒకటిరెండు ట్వీట్లతో వదిలేసేవాడేమో...

Aakash Chopra-Venkatesh Prasad

అయితే ఆకాశ్ చోప్రా, కెఎల్ రాహుల్ క్లాస్ ప్లేయర్ అని చెప్పేందుకు ప్రయత్నించి, వెంకటేశ్ ప్రసాద్‌తో క్లాసులు తినాల్సి వచ్చింది. కెఎల్ రాహుల్ ఇన్ని రోజులు టెస్టుల్లో ఉండడమే వేస్ట్ అన్నట్టుగా పాత లెక్కలు, బొక్కలు అన్నీ విడమర్చి సోషల్ మీడియాలో పెట్టేశాడు వెంకటేశ్ ప్రసాద్...

ఈ ఎపిసోడ్ చూసిన వాళ్లంతా వెంకటేశ్ ప్రసాద్‌కి, కెఎల్ రాహుల్‌కీ మధ్య వ్యక్తిగత విభేదాలు, పాత పగలు ఏమైనా ఉన్నాయేమో అనుకన్నారు. అయితే అలాంటి వెంకటేశ్ ప్రసాద్, కెఎల్ రాహుల్‌ని పొగుడుతూ ట్వీట్ చేశాడు..
 

Image credit: Getty

వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 91 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు కెఎల్ రాహుల్. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నా... కోహ్లీ, సూర్య, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా అవుటైన తర్వాత రాహుల్ ఆడిన ఇన్నింగ్స్.. ఈ మధ్యకాలంలో తాను ఆడిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్...

KL Rahul Catch

ఈ ఇన్నింగ్స్‌ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు వెంకటేశ్ ప్రసాద్. ‘ప్రెషర్‌లో ఎంతో ఏకాగ్రతగా బ్రిలియెంట్ ఇన్నింగ్స్ ఆడాడు కెఎల్ రాహుల్. టాప్ ఇన్నింగ్స్.. రవీంద్ర జడేజా సపోర్ట్ కూడా మరిచిపోకూడదు. ఇండియాకి మంచి విజయం అందించారు..’ అంటూ ట్వీట్ చేశాడు వెంకటేశ్ ప్రసాద్..

KL Rahul-Dravid

టీమ్‌లో పనికి రావని తిడుతూ ట్రోల్ చేసిన వ్యక్తితోనే గొప్ప ఇన్నింగ్స్ ఆడావని ట్వీట్ వేయించుకున్న కెఎల్ రాహుల్... ఆ గౌరవాన్ని కాపాడుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లోనూ టాప్ క్లాస్ పర్పామెన్స్ ఇవ్వాలి. లేదంటే గొప్ప ఇన్నింగ్స్ ఆడావని పొగిడిన ఈ ప్రసాదే, మిగిలిన మ్యాచుల్లో ఫెయిల్ అయితే సంజూ శాంసన్‌కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ వినిపించవచ్చు.. 

click me!