భారత జట్టులోకి కుల్దీప్ యాదవ్‌... మూడో వన్డేలో కొత్త కుర్రాళ్లకు ఛాన్స్! రోహిత్ ప్లేస్‌లో...

First Published Dec 9, 2022, 12:32 PM IST

బంగ్లాదేశ్‌ పర్యటనలో తొలి రెండు వన్డేల్లో ఓడి, సిరీస్ కోల్పోయింది భారత జట్టు. రెండు వన్డేల్లోనూ ఆఖరి వరకూ పోరాడినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. కనీసం మూడో వన్డేలో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది టీమిండియా. రోహిత్ శర్మ గాయపడడంతో మూడో వన్డేకి కెఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయబోతున్నాడు...

Rohit Sharma

రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రోహిత్ శర్మ, మెరుగైన చికిత్స కోసం ముంబైకి చేరుకున్నాడు. అలాగే వన్డే సిరీస్‌లో గాయపడిన దీపక్ చాహార్, కుల్దీప్ సేన్ కూడా స్వదేశం చేరుకుని బెంగళూరులోని ఎన్‌సీఏలో చేరారు. వీరిద్దరూ ఇక్కడే రిహాబ్‌టేషన్‌లో పాల్గొంటారు..

Image credit: PTI

కుల్దీప్ సేన్, దీపక్ చాహార్, రోహిత్ శర్మ గాయాలతో తప్పుకోవడంతో రిజర్వు బెంచ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్‌కి జట్టులో చోటు కల్పించింది టీమిండియా. కుల్దీప్ యాదవ్ చేరికతో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌, షాబజ్ అహ్మద్‌లకు తోడుగా మరో స్పిన్నర్ చేరినట్టైంది...

రోహిత్ శర్మ స్థానంలో టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్, మూడో వన్డేకి కెప్టెన్సీ చేయబోతున్నాడు. న్యూజిలాండ్ టూర్‌లో టీ20 సిరీస్ గెలిచిన హార్ధిక్ పాండ్యాకి ఈ సిరీస్‌లో చోటు దక్కలేదు.  అలాగే రిషబ్ పంత్, సిరీస్ ఆరంభానికి ముందు రెస్ట్ కావాలంటూ తప్పుకున్నాడు... దీంతో కెఎల్ రాహుల్‌కి లైన్ క్లియర్ అయిపోయింది...

చికిత్స కోసం ముంబై చేరుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు సిరీస్ ఆడతాడా? లేదా? అనేది కూడా అనుమానంగా మారింది. డిసెంబర్ 12 కల్లా రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఓ క్లారిటీ వస్తుందని, టెస్టుల్లో కెప్టెన్సీ చేయబోయేది ఎవరనే విషయాన్ని అప్పుడు ప్రకటించబోతున్నట్టు సమాచారం... జస్ప్రిత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో టెస్టు కెప్టెన్సీ కూడా రాహుల్‌కే దక్కొచ్చు.. 

రోహిత్ శర్మ గాయపడడంతో రాహుల్ త్రిపాఠి లేదా రజత్ పటిదార్‌లలో ఒకరు, మూడో వన్డేలో ఆడే అవకాశం కనిపిస్తోంది. అయితే కెఎల్ రాహుల్, కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాడా? లేక ఇషాన్ కిషన్‌ని ఓపెనర్‌గా జట్టులోకి తీసుకొస్తాడా? అనేది చూడాలి.. 

click me!