మీరు సరిగా ఆడలేక, ఐపీఎల్‌ని అనడం మూర్ఖత్వం... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్...

First Published Jan 21, 2022, 5:26 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు ఫెయిల్యూర్‌కి ఐపీఎల్‌యే కారణమని విమర్శలు వచ్చాయి. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఐపీఎల్ పెట్టడమే కొంపముంచిదన్నారు. అయితే యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ టీమ్ ఫెయిల్యూర్‌కి కూడా ఐపీఎల్‌యే కారణమని విమర్శలు వస్తున్నాయి...

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 4-0 తేడాతో చిత్తుగా ఓడింది. సిడ్నీలో జరిగిన నాలుగో టెస్టును డ్రా చేసుకోవడం మినహా మిగిలిన టెస్టుల్లో ఏ మాత్రం పోరాడకుండానే చేతుల్లేత్తేసింది ఇంగ్లాండ్ టీమ్..

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్, ఐపీఎల్ వల్లే ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిందంటూ విమర్శలు చేశాడు. ‘ఐపీఎల్‌ ఆడడానికి ప్లేయర్లు, వెళ్లిపోవడంతో యాషెస్ సిరీస్‌కి ముందు కావాల్సినంత ప్రాక్టీస్ చేయలేకపోయారు. ఇంగ్లాండ్ టీమ్ ఓటమికి ఇదే కారణం’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ గోవర్.

ఇంగ్లాండ్ టెస్టు టీమ్‌లో ఉన్న ఏ ప్లేయర్ కూడా ఐపీఎల్‌ సెకండ్ ఫేజ్ ఆడకపోవడం విశేషం. జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్, డేవిడ్ మలాన్ వంటి ప్లేయర్లు ఐపీఎల్‌ సెకండ్ ఫేజ్‌లోలో పాల్గొనలేదు.  

‘ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ ఓటమికి ఐపీఎల్‌ను తిట్టడం మూర్ఖత్వం, పిచ్చితనం. మన కౌంటీ సిస్టమ్‌పైన ఫోకస్ పెట్టాలి... సరైన కౌంటీ క్రికెట్‌ వ్యవస్థ లేదు...

మన పద్ధతి సరిగా లేనప్పుడు ఎవరిని అంటే మాత్రం ఏంటి. ఇంగ్లాండ్ టెస్టు టీమ్ నుంచి ఎంత మంది ఐపీఎల్ ఆడుతున్నాడో చూడండి...

మహా అయితే బెన్ స్టోక్స్, బెయిర్ స్టో, జోస్ బట్లర్ మాత్రమే. మిగిలిన టెస్టు ప్లేయర్లు ఎవ్వరూ ఐపీఎల్ ఆడడం లేదు, వారికి అక్కడ అవకాశాలే రావడం లేదు...

అలాంటప్పుడు ఇంగ్లాండ్ టెస్టు టీమ్ ఆటతీరుకి ఐపీఎల్ కారణమని ఎలా అంటారు. బయో బబుల్‌లో క్రికెట్ ఆడడం చాలా కష్టం... నేనైతే ఎప్పుడూ ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ ఆడలేదు...

కాఫీ షాప్‌కి వెళ్లడానికి కూడా స్వేచ్ఛ లేనప్పుడు, ఏం చేయాలన్నా అనుమతి లేనప్పుడు స్వేచ్ఛగా క్రికెట్ ఎలా ఆడగలరు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కేవిన్ పీటర్సన్...

click me!