సెంచ‌రీ హీరో జీరో అయ్యాడు ! సంజూ శాంసన్ ఇలా చేశాడేంటి

First Published | Nov 10, 2024, 10:40 PM IST

IND vs SA: భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండవ మ్యాచ్ సెయింట్ జార్జ్ పార్క్ లో జ‌రిగింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, భార‌త ప్లేయ‌ర్లు వ‌రుస‌గా వికెట్లు కోల్పోవ‌డంతో ప్రోటీస్ ముందు స్వ‌ల్ప టార్గెట్ ను ఉంచింది. 

IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ లో ప్రోటీస్ జ‌ట్టు బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. దీంతో భార‌త్ స్వ‌ల్ప స్కోర్ చేసింది. సెయింట్ జార్జ్ పార్క్, గ్కేబర్హాలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. గత మ్యాచ్‌లో కూడా భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా భారత జట్టు బరిలోకి దిగింది. 

డర్బన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.  తొలి మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. తొలి మ్యాచ్ లో అద్భుతంగా డ‌బుల్ సెంచ‌రీ స్కోర్ చేసిన భార‌త జ‌ట్టు రెండో రెండో మ్యాచ్‌లో త‌డ‌బ‌డింది. 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 124 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 

Sanju Samson

సెంచ‌రీ హీరో సంజూ శాంస‌న్ జీరోకే పెవిలియ‌న్ చేరాడు 

వరుసగా రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ అనేక రికార్డులు సాధించాడు. భారత్ vs సౌతాఫ్రికా రెండో మ్యాచ్ లో కూడా అత‌నిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే,. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో అత‌ను ఖాతా తెరవలేకపోయాడు. గ‌త మ్యాచ్ సెంచ‌రీ హీరో సంజూ శాంస‌న్ జీరో ప‌రుగుల‌కే పెవిలియ‌న్ కు చేరాడు.

మ్యాచ్‌లోని మూడో బంతికే అతడిని క్లీన్ బౌల్డ్ చేసి మార్కో జాన్సన్ పెవిలియన్ దారి చూపించాడు. డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించి భారత విజయ వీరుడిగా నిలిచిన శాంసన్.. భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. శాంసన్ ఇంతకుముందు తన చివరి రెండు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సెంచరీలు సాధించడం విశేషం. 

Latest Videos


Sanju Samson

మూడో బంతికే బౌల్డ్ అయిన సంజూ శాంస‌న్ 

అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన సంజూ శాంసన్‌ నుంచి మరో భారీ ఇన్నింగ్స్‌ను అభిమానులు ఆశించారు. అయితే ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మార్కో యాన్సెన్ వేసిన ఓవర్ మూడో బంతికి శాంసన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, షాట్ ఆడుతున్న సమయంలో అతని బ్యాట్‌కు బంతితో ఎలాంటి సంబంధం లేకపోవడంతో బంతి స్టంప్‌లను తాకింది. అతను ఔట్ అయిన వెంటనే.. కామెంట‌రీ చేస్తున్న షాన్ పొలాక్, 'హీరో టు జీరో' అని చెప్ప‌డం ఇప్పుడు వైర‌ల్ గా మారింది. శాంసన్ బోల్డ్ అయిన వీడియో దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

గత మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన సంజూ శాంస‌న్ 

గత మ్యాచ్‌లో సంజూ శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించాడు. అతను కేవలం 50 బంతుల్లో 107 పరుగులతో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడ‌. త‌న ఇన్నింగ్స్‌లో 10 సిక్స్‌లు, 7 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్‌పై దక్షిణాఫ్రికా బౌలర్లు నిస్సహాయంగా కనిపించారు. అయితే రెండో మ్యాచ్‌లో కూడా అతని ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంటుంద‌ని భావించిన అభిమానుల‌కు నిరాశ ఎదురైంది. 

రెండు జట్లలో ప్లేయింగ్-11

భారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అవేష్ ఖాన్.

దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్ (సి), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిలే సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, నకబయోమ్జీ పీటర్.

click me!