విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నుంచి నేర్చుకోవాల్సిన విలువైన పాఠాలు... ప్రెషర్‌కీ, సక్సెస్‌కీ మధ్య...

Published : Oct 24, 2022, 01:57 PM ISTUpdated : Oct 24, 2022, 02:01 PM IST

విరాట్ కోహ్లీ... నిస్సందేహాంగా వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్. ఇప్పటికే 71 అంతర్జాతీయ సెంచరీలు బాదేసిన విరాట్ కోహ్లీ సత్తా గురించి, టాలెంట్ గురించి ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. టీమ్‌లో విరాట్ కోహ్లీని మిగిలిన ప్లేయర్లతో వేరు చేసే మరో విషయం ఉంది. అదే ప్రెషర్‌ని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయడం...

PREV
19
విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నుంచి నేర్చుకోవాల్సిన విలువైన పాఠాలు... ప్రెషర్‌కీ, సక్సెస్‌కీ మధ్య...

విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ చాలా మంచి బ్యాటర్. కోహ్లీ షాట్స్ కొట్టడానికి బలం ఉపయోగిస్తే, రోహిత్ చాలా సింపుల్‌గా టెక్నిక్‌తో సిక్సర్లు రాబడతాడు. కెఎల్ రాహుల్ క్లాస్ బ్యాటర్. అయితే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు... కానీ కోహ్లీ మాత్రం వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియాకి మధురమైన విజయాన్ని అందించాడు...

29
Virat Kohli

టీమిండియా విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 48 పరుగులు కావాల్సి వచ్చాయి. క్రీజులో ఉన్న కోహ్లీ మంచి బ్యాటర్ అయినా పెద్ద హిట్టర్ కాదు. అందుకే అభిమానుల్లో ఎక్కడో సందేహాం. అయితే విరాట్ ఇక్కడే తన మాస్టర్ మైండ్‌ని ఉపయోగించాడు. 

39

అప్పటికే నసీం షా పూర్తి కోటా బౌలింగ్ చేసేశాడు.. గత వరల్డ్ కప్‌లో 3 వికెట్లు తీసిన షాహీన్ ఆఫ్రిదీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో మూడు ఫోర్లు బాది 17 పరుగులు రాబట్టాడు విరాట్ కోహ్లీ... అయితే హారీస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్‌లో మొదటి 4 బంతుల్లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి...

49
Image credit: Getty

‘షాహీన్ ఆఫ్రిదీ వేసిన 17వ ఓవర్‌లో అతన్ని టార్గెట్ చేయాలని ముందుగానే అనుకున్నా. అనుకున్నట్టే భారీ షాట్స్‌కి ప్రయత్నించకుండా గ్యాప్స్ చూసి షాట్స్ ఆడాను. హారీస్ రౌఫ్ వాళ్లకు ప్రైమ్ బౌలర్. అతని బౌలింగ్‌లో షాట్స్ ఆడితే... మిగిలిన బౌలర్లలో భయం మొదలవుతుంది. ప్రెషర్ క్రియేట్ అవుతుంది... నవాజ్ బౌలింగ్‌లో జరిగింది అదే...’ అంటూ మ్యాచ్ అనంతరం కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

59

ప్రత్యర్థి జట్టులో ఉన్న బెస్ట్ ప్లేయర్‌ని టార్గెట్ చేస్తే, మిగిలిన జట్టులో భయం క్రియేట్ అవుతుంది. రాజమౌళి చెక్కిన ‘బాహుబలి’లో కాలకేయుల యుద్ధంలోనూ మనం చూసింది ఇదే. అప్పటిదాకా మాహీష్మతి సైన్యంపైన అత్యంత క్రూరంగా దాడి చేసిన కాలకేయ సైన్యం, కాలకేయుడి శవాన్ని చూసిన తర్వాత వారి బలాన్ని మరిచి ప్రాణభయంతో పరుగులు తీస్తుంది...  కోహ్లీ ఎంచుకున్న ఫార్ములా కూడా ఇదే...
 

69
virat kohli

జీవితంలో ఎదురైన ప్రతీ సమస్య, మనలో మానసిక ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. చిన్న చిన్న పరీక్షలు రాయడానికే అనవసర ఒత్తిడికి లోనవుతూ, డిప్రెషన్‌కి గురవుతున్నారు నేటి తరం విద్యార్థులు. ప్రెషర్‌‌కీ, సక్సెస్‌కి మధ్య తేడా చాలా సన్నని గీతే. అదే ఓటమి. ప్రెషర్‌ని తట్టుకోలేక ఆగిపోతే ఓటమిలో కూరుకుపోతాం. ఒత్తిడిని అధిగమించినప్పుడే ఓటమి అనే గీతని దాటి విజయం వరిస్తుంది...

79
Virat Kohli Six

విరాట్ కోహ్లీ, ప్రత్యర్థి జట్టు కాన్ఫిడెన్స్‌ని దెబ్బ తీయడానికి బెస్ట్ ప్లేయర్‌ని టార్గెట్ చేసినట్టే... పరీక్షల్లో విజయం అందుకోవాలంటే క్లాస్‌లో బెస్ట్ స్టూడెంట్‌ని టార్గెట్‌గా పెట్టుకోవాలి. అతని కంటే ఒక్క మార్కు ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి... 8 బంతుల్లో 26 పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు కూడా విరాట్ కోహ్లీ వదిలేయలేదు. హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు...

89
Virat Kohli

హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఆడడానికే బ్యాటర్లు భయపడుతున్న సమయంలో విరాట్ కోహ్లీ, అతని బౌలింగ్‌లో రెండు చూడచక్కని సిక్సర్లు బాదాడు. ఆ రెండు బంతులను వేయడంలో హారీస్ రౌఫ్ ఎలాంటి తప్పు చేయలేదు. అయితే వాటిని మిడిల్ చేసి, బౌండరీ అవతల పడేయడంలో విరాట్ కోహ్లీ మాస్టర్ క్లాస్ చూపించాడు.. బౌలర్ మిస్టేక్ ఏమీ లేదు ఆ క్రెడిట్ మొత్తం అతనికే దక్కాలి.

99

రోహిత్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ అవుట్ అయినా ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ పోరాడి... టీమిండియా విజయాన్ని అందుకుంది. అయితే ఎన్ని సమస్యలు ఎదురైనా ఓటమిని ఒప్పుకోకుండా పట్టు వదలకుండా ప్రయత్నిస్తే... శిఖరమైనా తలవంచి తీరుతుంది. పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా, విరాట్ కోహ్లీ చూపించింది, నేటి తరానికి నేర్పించిన పాఠాలు ఇవే.. 

Read more Photos on
click me!

Recommended Stories