అన్న కోసం ఆ పదవిని కూడా వదులుకున్న దాదా.. ఎందుకు పోటీ చేయలేదనేదానికి విచిత్ర సమాధానం

Published : Oct 24, 2022, 11:38 AM IST

Sourav Ganguly: రెండోసారి బీసీసీఐ అధ్యక్ష పదవి దక్కించుకోవాలని చూసి భంగపడ్డ తాజా మాజీ అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ  ఇప్పుడు  తన సొంత రాష్ట్రంలో కూడా ఏం పదవి లేకుండానే ఉండనున్నాడు.  తన  సోదరుడి కోసం కీలక పదవిని వదులుకున్నాడు. 

PREV
16
అన్న కోసం ఆ పదవిని కూడా వదులుకున్న దాదా..  ఎందుకు పోటీ చేయలేదనేదానికి విచిత్ర సమాధానం

బీసీసీఐ అధ్యక్ష పదవి రెండోసారి దక్కకపోయినా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా పోటీ చేసి బీసీసీఐలో చక్రం తిప్పాలని చూసిన   సౌరవ్ గంగూలీ ఆశలు అడియాసలే అయ్యాయి.  బీసీసీఐలో రాజకీయాలకు బలైన దాదా.. క్యాబ్ లో రక్త సంబంధానికి విలువనిచ్చి  పోటీ  చేయకుండా  తప్పుకున్నాడు. 
 

26
Image credit: PTI

తన అన్న స్నేహశీశ్ గంగూలీ కోసం దాదా క్యాబ్ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నాడు. క్యాబ్ అధ్యక్ష పదవితో పాటు ఇతర పోస్టులకు  పోటీ చేసేందుకు నామినేషన్  తుది గడువు ఆదివారంతో ముగిసింది. అయితే దాదా మాత్రం నామినేషన్ సమర్పించకుండానే  ఈ పోటీ నుంచి తప్పుకున్నాడు. 

36

బీసీసీఐలో రెండో సారి పదవి దక్కకపోవడంతో పాటు తనను ఐసీసీ ప్రతినిధిగా కూడా పంపనందుకు తీవ్ర నిరాశలో ఉన్న దాదా.. క్యాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలో ప్రకటించాడు. అక్టోబర్ 22న నామినేషన్ వేస్తానని కూడా  చెప్పాడు.  తద్వారా తిరిగి బీసీసీఐ లో చక్రం తిప్పాలని దాదా  భావించాడు. కానీ ఏదీ  దాదాకు అనుకూలంగా జరుగలేదు. 

46

పోటీ నుంచి దాదా తప్పుకోవడంతో క్యాబ్ అధ్యక్షుడిగా  స్నేహశీశ్ గంగూలీ ఎంపిక లాంఛనమే. స్నేహశీశ్ తో పాటు ఉపాధ్యక్షుడిగా అమలేందు విశ్వాస్, సెక్రటరీగా   నరేశ్ ఓజా, ట్రెజరర్ గా  ప్రభీర్ చక్రవర్తి,  జాయింట్ సెక్రటరీగా  దేబబ్రత దాస్ గా త్వరలోనే తమ పదవుల్లో కొలువుదీరనున్నారు.  

56
Sourav Ganguly 1

అయితే  గతంలో తాను క్యాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఇప్పుడు పోటీ నుంచి తప్పుకోవడంపై  దాదా మాట్లాడుతూ.. ‘నేను  ఎన్నికలు ఉంటే పోటీ చేస్తానని చెప్పాను. కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు కదా.  అందుకే నేను పోటీ చేయడం లేదు. గతంలో నేను క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్నాను. క్యాబ్ లో కొత్తవారికి కూడా అవకాశమివ్వాలి.  వాళ్లు కూడా మూడేండ్ల పాలన చేయాలి. ఆ తర్వాత చూద్దాం..’ అని తెలిపాడు. 

66

మరి మీ నెక్స్ట్ ఇన్నింగ్స్ ఏంటి అనే ప్రశ్నకు దాదా  స్పందిస్తూ..  ‘చూద్దాం. ఇప్పుడు నాకు ఎలాంటి బాధ్యతలూ లేవు.  ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నా. క్యాబ్ లో నాకు శత్రువులు ఎవరూ లేరు. అందరూ నావాళ్లే. నేను అక్కడున్నా లేకున్నా వారికి నా సాయం ఎప్పటికీ ఉంటుంది..’ అని తెలిపాడు. 

click me!

Recommended Stories